Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ కమిషనర్‌కు వినతి
- సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎల్లయ్య
నవతెలంగాణ-గజ్వేల్
గజ్వేల్ పట్టణంలోని అర్హులందరికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో గజ్వేల్ మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సందబోయిన ఎల్లయ్య మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా గజ్వేల్ పట్టణంలో ఒక్కరికి కూడా ఇండ్లు నిర్మించి ఇవ్వలేదన్నారు. పెండింగ్‌లో ఉన్న రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని, ఐఓసీ నుంచి సంగాపూర్ వరకు వీధిలైట్లు వేయాలని, అర్హులైన వారందరికీ పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్, రెవెన్యూ అధికారులకు డబల్ బెడ్ రూమ్ ఇండ్ల కొరకు దరఖాస్తు చేసుకొని సంవత్సరాలు గడుస్తున్నాయి తప్ప పరిష్కారం కావడం లేదన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం నత్తనడకన సాగుతుందని పూర్తిగా పనులు చేయకుండానే ముందుకు వెళ్లడం జరుగుతుం దన్నారు. దానిపై సంబంధిత కాంట్రాక్టర్ దష్టికి తీసుకొచ్చిన సక్రమంగా పనులు చేయడం లేదని అన్నారు. వెంటనే ప్రజా సమస్యలు పరిష్కరించాలని లేనిచో ప్రజలను సమీకరించి ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల నాయకులు రంగారెడ్డి, నర్సింలు, అహ్మద్, శేఖర్, ముఖేష్ రాజు పాల్గొన్నారు.