Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీస్ కమిషనర్ శ్వేతా
నవతెలంగాణ-సిద్దిపేట
నాణాలను సేకరించడం విద్యార్థులు అభిరు చిగా అలవాటు చేసుకోవాలని పోలీస్ కమిషనర్ శ్వేతా సూచించారు. రెండు రోజుల రాష్ట్రస్థాయి సదస్సులో భాగంగా మంగళవారం ముగింపు సభ నిర్వహించారు. ఈ సమావేశానికి కళాశాల ప్రిన్సి పాల్ డాక్టర్ సి. హెచ్ ప్రసాద్ అధ్యక్షత వహిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చరిత్ర కు మూలాలైన నాణాలను అధ్యయనం చేయడం ద్వారా కొత్త చరిత్రను నిర్మించవచ్చని ఆన్నారు. మరుగున పడిన తెలంగాణ చరిత్రను పవర్ పాయింట్ ప్రదర్శన ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించి, ఏ విధంగా చూడాలి, వాటిని అధ్యయనం చేసే తీరును టార్చ్ సభ్యులు అరవింద్ ఆర్య కూలంకషంగా వివరించడం జరిగింది. తెలంగాణలో చరిత్ర కెక్కని విగ్రహాలు, గుట్టలు, శాసనాలు ఎన్నో ఉన్నాయని, వెలికి తీయాల్సిన బాధ్యత యువతగా మనందరిపైన ఉందని సూచించినారు. చరిత్ర విభాగం నిర్వహించే నాణాల ప్రదర్శనతో పాటు అను బంధంగా శాసనాల పైన కూడా అవగాహన కల్పిం చడం చరిత్ర చదివే విద్యార్థులకు ప్రత్యక్ష అనుభూ తిని కలిగిస్తుందని సూచించినారు. చరిత్ర విభాగా ధిపతి డాక్టర్ కొలిపాక శ్రీనివాసు మాట్లాడుతూ చరిత్ర లిఖించడానికి నాణేలు ఎంత ప్రాముఖ్యం వహిస్తాయో, శాసనాలు కూడా అంతే ప్రాముఖ్యతను సంతరించుకుంటాయని ఉద్ఘాటించారు. ఈ కార్యక్ర మంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె హుస్సేన్, అకాడమిక్ సెల్ కన్వీనర్ డాక్టర్ కే భవాని, ఐక్యూ ఏసి కోఆర్డినేటర్ డాక్టర్ సిహెచ్ మధుసూదన్, అకాడమీ కోఆర్డినేటర్ డాక్టర్ టి మల్లేశం, సదస్సు సంచాలకులు డాక్టర్ కే శ్రీనివాసులు, భిక్షపతి, కొండ ల్ రెడ్డి, డా.ఎం.శ్రద్దానందం, డా.రాణి, ఎం.బైరయ్య, సమన్వయకర్తగా డాక్టర్ పి పల్లవి, అధ్యాపకేతర బృందంతోపాటు విద్యార్థులు పాల్గొన్నారు.