Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోహెడ
వర్షాకాలంలో వరి, మొక్కజోన్న, పత్తి తదితర పంటలపై రైతులు జాగ్రత్తలు వహించాలని వ్యవసాయ విస్తరణ అధికారి శివకుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని వింజపల్లి గ్రామంలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పత్తిలో పారా విల్ట్ గమనించినట్లు తెలిపారు. పారా విల్ట్ సోకిన మొక్కలు ఆకులు వాడిపోయి మొదట ఈనెల మధ్య పసుపు రంగులో అనంతరం ఎరుపురంగులోకి మారి ఆకులు కింది నుండిపై వరకు ఎండుకుంటు రాలిపోతాయన్నారు. ఈ తెగులు అన్ని దశలలో కన్పిస్తుందని, ఎదిగిన మొక్కలలో పుష్పించే దశలో ఈ తెగులు ఎక్కువగా కనబడుతుందన్నారు. దీని నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రాములు లేదా కార్బెండిజం 1గ్రాము లీటరు నీటికి కలిపిన ద్రావణాన్ని తెగులు సోకిన మొక్కల మొదలు చుట్టూ పిచికారి చేయాలన్నారు. 19.19.19 ఎరువును 10గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. రెండవ విడత నేల అడుగు భాగాన స్ప్రింట్ 2గ్రాముల మందును లీటరు నీటికి కలిపి మొదలు భాగాన పిచికారి చేయడంతో పాటు పొటాష్ ఎరువులను తప్పక వాడాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, గ్రామస్థులు తదితరులు పాల్గోన్నారు.
నవతెలంగాణ-మర్కుక్ : మండలంలోని వివిధ గ్రామాలలో అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న పత్తి పొలాలను మండల వ్యవసాయ అధికారి డా. టి.నాగేందర్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీరు నిలువ వుండే పొలాల్లో అత్యంత వేగంగా పెరిగే ఈ పారా విల్ట్ అనేది ఒక భౌతికమైన రుగ్మత, ఆకులు ఎండిపోవడం, రంగు మారడం దీని లక్షణాలన్నారు. ఈ తెగు లు విస్తరించేకొలది ఆకులు రంగు రాలిపోవడం నుంచి ఎరుపు రంగులోకి మారతాయ న్నారు. పారావిల్ట్ ను ''సడెన్ విల్ట్'' అని కూడా పిలుస్తారన్నారు. ఇది పొలం లో చెదురు మదురుగా కొన్నిప్రాంతాలలో కనిపి స్తుందన్నారు. ఒకే న మూనాలో పొలంలో కనిపించ దని, దీని లక్షణాలను ఇతర తెగుళ్ల లక్షణాలకు పోలిక ఉండడం వలన అయోమయానికి గురిచేస్తుం దన్నారు. కాయలు, ఆకులు ముందుగానే రాలిపో వడం కాయలు విచ్చుకుపోవడం జరుగవచ్చన్నారు. మొక్క కోలుకోవచ్చు కానీ దిగుబడి మాత్రం తగ్గుతుందన్నారు.