Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మెదక్ రూరల్
సమర్ధుడైన నాయకులను ఎన్నుకోవడంలో ఓటర్లే కీలకమని, కావున 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువత ఓటరుగా నమోదు చేసుకోవాలని అదనపు కలెక్టర్ రమేష్ మంగళవారం అన్నారు. గతంలో జనవరి1 ప్రామాణికంగా 18 సంవత్సరాలు నిండిన యువతకు ఒక్కసారి మాత్రమే ఓటరుగా నమోదుకు అవకాశముండేదని కానీ భారత ఎన్నికల కమీషన్ ఎక్కువ మంది యువ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రతి ఏటా జనవరి 1, ఏప్రిల్ 1, జులై 1, అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతకు ఓటు హక్కు కల్పించుటకు సంవత్సరంలో నాలుగు పర్యాయాలు ఓటరు నమోదుకు అవకాశం కల్పించిందని అన్నారు. మంగళవారం స్వీప్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లోని ఆడిటోరియం లో వివిధ కళాశాలల అంబాసిడర్లకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో మాట్లాడుతూ ఎలక్టోరల్ లిటరసీ పై కళాశాలలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేయించడంతో పాటు బంధువులు స్నేహితులకు ఓటు ప్రాముఖ్యతను వివరించి ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కలిగించాలన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరచిన క్యాంపస్ అంబాసిడర్లకు జాతీయ ఓటరు దినోత్సవం నాడు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందజేస్తామని రమేష్ తెలిపారు. మండలాధికారి సాయిరామ్ మాట్లా డుతూ బ్లాక్ స్థాయి అధికారుల సహకారంతో 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువత ఓటరుగా నమోదయ్యేలా కృషి చేయాలని అంబాసిడర్లకు సూచించారు. స్వీప్ నోడల్ అధికారి రాజి రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా క్యాం పస్ అంబాసిడర్లకు ఓటరు నమోదుపై అవగాహన కలిగించారు. జిల్లా పరిషద్ సి.ఈ.ఓ. శైలేష్ ఈ.డి.ఏం.సందీప్ ఎలక్టోరల్ లిటరసి నోడల్ అధికారులు క్యాంపస్ అంబాసిడర్లు పాల్గొన్నారు.