Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిద్దిపేట
అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కొరకు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా నుంచి చలో అసెంబ్లీకి తరలి వెళ్లిన టీపీటీఎఫ్ ప్రతినిధులను అసెంబ్లీ సమీపంలో అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్రమ అరెస్టులకు తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీపీటీఎఫ్ సీనియర్ నాయకులు జీ.తిరుపతి రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దీర్ఘకాలికంగా అపరిస్కతంగా ఉన్న సమస్యల పరిష్కారం కొరకు యూఎస్పీసీ అనేక ప్రాతినిధ్యాలు, ఉద్యమాలు చేసినప్పటికీ ప్రభుత్వం పరిష్కారానికి చొరవ చూపకుండా, కనీసం ఉపాధ్యాయ సంఘాలతో సమీక్షలు నిర్వహించకుండా, గడిచిన ఎనిమిది సంవత్సరాలుగా విద్యారంగం పట్ల నిర్లక్ష్యం వహిస్తూ వెనుకబాటుతనానికి కారణం అవుతుందన్నారు. పోలీసులతో అక్రమ అరెస్టులు చేపిస్తూ నిర్బంధాలు విధించడం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. ఇప్పటికైనా సీఎం స్వయంగా ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించి, సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు విజేందర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు నర్సింహారెడ్డి, మిరుదొడ్డి మండల అధ్యక్షులు శ్రీనివాస్, ప్రదాన కార్యదర్శి చంద్రశేఖర్, వివిధ మండలాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
నవ తెలంగాణ-మిరుదొడ్డి
అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారం కొరకు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా నుంచి పోలీసు నిర్బంధాలను అధిగమిస్తూ చలో అసెంబ్లీకి తరలి వెళ్లిన టీపీటీఎఫ్ సిద్దిపేట జిల్లా ప్రతినిధులను అసెంబ్లీ సమీపంలో అక్రమంగా అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్్ జిల్లా కార్యదర్శి మల్లేష్ మాట్లాడుతూ దీర్ఘకాలికంగా అపరిస్కతంగా ఉన్న సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ను విడుదల చేసి దసరా సెలవుల్లో పూర్తి చేయాలన్నారు. పాత పింఛన్ విధానాన్ని రద్దుచేసి చేయాలన్నారు. పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్లో తాత్కాలికంగా వాలంటీర్లను నియ మించాలని, పారిశుద్ధ్య కార్మికులను శాశ్వత ప్రాతిపదికన నియమించాలన్నారు. ఇప్పటికైనా సీఎం స్వయంగా ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ సిద్దిపేట జిల్లా కార్యదర్శి ర్యాకం మల్లేశం, మిరుదొడ్డి మండల అధ్యక్షులు శ్రీనివాస్, ప్రదాన కార్యదర్శి చంద్రశేఖర్ వివిధ మండలాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.