Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రామచంద్రాపురం
పటాన్ చెరు, బీరంగూడ కమాన్, అశోక్ నగర్లలో ఫ్లై ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మించాలని సీఐటీయూ జిల్లా ఉపా ధ్యక్షులు బి నాగేశ్వరరావు జీహెచ్ఎంసీ అధికారులను డిమాండ్ చేశారు. పటాన్చెరు, రామచంద్రపూర్ జీహె చ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం సూపరి ంటెండెంట్కు మెమొరాండం అందజేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. పటాన్ చెరు పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జాతీయ రహదారిపై ఫ్లై ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించాలన్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వందలాది మంది ప్రజలు అనేక పనుల కోసం పటాన్ చెరు, లింగంపల్లి ఇతర ప్రాంతాలకు వెళ్లి వస్తుంటారన్నారు. దీంతో రోడ్డు దాటాలంటే పాదా చారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఆర్ టీసీ బస్టాండ్ వద్ద రోడ్డు దాటాలంటే 5,10 నిమిశాల సమ యం పడుతుందన్నారు. దీంతో ట్రాఫిక్ జామ్ అవుతుం దన్నారు. ప్రజల అవసరాలను దష్టిలో పెట్టుకొని పటాన్ చెరు, బీరంగూడ కమాన్, అశోక్ నగర్లలో ఫ్లై ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మించాలని అన్నారు. లేని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సీఐటీయూ నాయకులు నర్సిం గ రావు, అప్ప, మల్లేశం,కష్ణ, దశరతరెడ్డి, మల్లన్న పాల్గొన్నారు.