Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సంగారెడ్డి
గ్రామ మపంచాయతీ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్ట రట్ ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సంద ర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి సాయిలు మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ కార్మికులకు ముఖ్యమంత్రి చెప్పి న విధంగా ప్రతి ఒక్కరికి రూ.8,500 ఇవ్వాలని, మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, పీఆర్సీ అమలు చేయాల న్నారు. రాష్ట్రంలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, పార్ట్ టైం పర్మినెం ట్ ఉద్యోగులకు జీతాలు పెంచిన విధంగా గ్రామపం చాయతీ కార్మికులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో పారిశుధ్య పనులు చేస్తూ శుభ్రపరుస్తున్న కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం సరికాదన్నారు. వెంటనే 2019లో వారికి ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ ఒక్క రికి వేతనాలు అమలు చేయాలని కోరారు. సబ్బులు నూ నెలు బట్టలు, బెల్లం ప్రతినెలా రెగ్యులర్గా ఇవ్వాలని గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిచో రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీ కార్మికులను సమీకరించి ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఇచ్చిన మాట కట్టు బడి ఉండాలని కోరారు. యూనియన్ జిల్లా అధ్యక్ష కార్య దర్శులు సత్తయ్య, దశరథ్ సిఐటియు జిల్లా నాయకులు కృష్ణ గ్రామపంచాయతీ కార్మికులు షబ్బీర్, కిష్టయ్య , వెంకటయ్య, శేఖర్, నగేష్, ఆనంద్, నిరంజన్, శంకర్, లక్ష్మి నాగమణి గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.