Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంగారెడ్డి
'ఛలో అసెంబ్లీ'లో పాల్గొన్న ఉపాధ్యాయులను అరెస్టులు చేయడం అన్యాయమని.. దీన్ని టీఎస్ యూటీఎఫ్ తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆ సంఘం సంగారెడ్డి జిల్లా అధ ్యక్షులు కే. అశోక్, ప్రధాన కార్యదర్శి బి. సాయిలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బదిలీలు, పదోన ్నతుల ద్వారా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను తీర్చాల ని, అసంబద్ధమైన సీపీఎస్ విధానం రద్దుచేసి పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని.. జీవో 317 ద్వారా స్థానికత కోల్పోయి ఇబ్బంది పడుతున్న ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని పలు డిమాండ్లతో మంగళవారం ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. అయితే శాంతి యుతంగా ర్యాలీ చేస్తున్న ఉపాధ్యాయులను కావాలని పోలీ సులు అరెస్టు చేయడం సరికాదన్నారు. విద్యారంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వినాశకారి విధానంగా మారు స్తున్నదని, పాఠశాలల బలోపేతం కోసం ఎలాంటి ప్రయ త్నం చేయడం లేదన్నారు. ఛలో అసెంబ్లీ కార్యక్రమంలో అరెస్ట్ అయిన వారిలో సంగారెడ్డి యూటీ ఎఫ్ నాయకులు జిల్లా కోశాధికారి శ్రీనివా సరావు రాష్ట్ర కమిటీ సభ్యులు జ్ఞానమంజరి, అమరేశ్వరి, సుదర్షన్, జిల్లా కార్యదర్శులు కష్ణ మూర్తి, శామయ్య, సమియోద్దీన్, సిరాజోద్దిన్, కష్ణం రాజు నాయకులు విజరు, శ్యాంసుం దర్, శంకర్, శ్యాంప్రసాద్, దేవదానం, గంగ మో హన్, ప్రశాంత్, జావిద్ అలీ, మక్సూద్, యాదయ్య, ఏవాన్, మహబూబ్, బాబర్ ఉన్నారు.
ఏండ్లుగా పెండింగులో ఉన్న సమస్యల సాధన కోసం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహి ంచిన ఛలో అసెంబ్లీ విజయవంతం అయ్యిందని టీపీటీఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ కుమార్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా 200 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారన్నారు. కాగా ఒక రోజు ముందు నుండే ఉపాధ్యాయుల ఇంటింటికి, పాఠ శాలలకు పోలీసులు తిరిగి అక్రమ అరెస్టులు చేశారన్నారు. పోలీసుల అరెస్టులు ఛేదించి ఉపాధ్యాయులు అసెంబ్లీ ప్రాంతానికి చేరుకున్నారన్నారు. బాగ్ లింగం పల్లి సుంద రయ్య విజ్ఞాన కేంద్రం నుండి వందల సంఖ్యలో ర్యాలిగా అసెంబ్లీకి చేరుకున్నారమన్నారు. పోలీసులు చేసిన అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జిల్లా నుండి అరెస్ట్ అయిన వారిలోరాష్ట్ర అధ్యక్షులు అశోక్ కుమార్, జిల్లా అధ్యక్షులు నాగారాం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి అను ముల రాంచందర్, రాష్ట్ర కౌన్సిలర్లు రాజారెడ్డి, లక్ష్మయ్య యా దవ్, సంజీవయ్య, సోమశేఖర్, ఖంరోద్దీన్, సుభాష్ బాబు జిల్లా ఉపాధ్యక్షులు విజరు భాస్కర్, నాసర్ పటేల్, రాంచ ందర్ భీమ్ వంశీ, సాయిలు చారి, బిచ్చయ్య, జిల్లా కార్యదర్శులు తదితరులున్నారు.
మనూర్ : గత ఏడేండ్లుగా ఉపాధ్యాయులు పడుతున్న సమస్యలను పరిష్కరిం చాలని డిమాండ్ చేస్తూ మంగళ వారం రాష్ట్ర ఉపాధ్యాయుల ఐక్య కార్యచరణ పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన మండల ఉపాధ్యాయ ులను పోలీసుల అడ్డుకొని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు పోలీస్ స్టేషన్ ఆవరణంలో మీడియాతో మాట్లాడు తూ.. అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా అరెస్టులు చేయడం సరికాదన్నారు.