Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాయపోల్
విద్యార్థులకు చదువుతోపాటు వ్యక్తిగత పరిశుభ్రత కూడా ఎంతో అవసరమని.. వీటిని తూచా తప్పకుండా పాటిస్తేనే అభివృద్ధితో పాటు ఆరోగ్యంగా ఉంటారని రాయ పోల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు కరుణాకర్ అన్నారు. శుక్రవారం రాయపొల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కేజీబీవీ పాఠశాలలో సత్యసాయి సేవా సమితి హైదరాబాద్ వారు పాఠశాల గణిత ఉపాధ్యాయులు తులసీదాస్, సత్య సాయి సేవ సమితి సభ్యులు సాయికుమార్ సహకారంతో డాక్టర్ రఫత్ చేత పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిగత పరిశుభ్రత పై అవగాహన కార్యక్రమం, రూ.50 వేల విలువ గల సానిటైసర్ నాప్కిన్ పాకెట్స్, బాలురకు పర్సనాలిటి డేవల ప్మెంట్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల విద్యార్థులకు సత్యసాయి సేవా సమితి సహకారం అభినందనీ యమన్నారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ఎస్ఓ సుగంధ లత, సీఆర్పీ కుమారస్వామి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.