Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చేగుంట
మెదక్ జిల్లా నార్సింగిమండల కేంద్రంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు గోవర్ధన్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించారు. ఈ నిరసనలో కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ డబల్ బెడ్ రూమ్‌కు శిలాఫలాకం వేసి ఏండ్లు గడుస్తున్నదని.. అయినప్పటికీ నేటికీ ఇండ్లు పంపిణీ చేయలేదన్నారు. మాజీ మంత్రి, దివంగత నేత చెరుకు ముత్యం రెడ్డి చిత్రపటానికి పూల మాలవేసి నివాళులర్పించారు. నార్సింగి మండల ప్రజలకు డబల్ రోడ్డు, డబల్ బెడ్ రూమ్ ఇచ్చేవరకు నిరసన దీక్ష కొనసాగి స్తామన్నారు. కాగా కళాబృందాలతో సభ దద్దరిల్లింది. నార్సింగి గ్రామ ప్రజలు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పిటిసి రమణ, నార్సింగ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంగార్ల గోవర్ధన్, సీనియర్ నాయకులు గజ గట్ల కేశవులు తదితరులు పాల్గొన్నారు.