Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుబ్బాక
జిల్లా పరిషత్ నిధుల నుంచి పలు అభివృద్ధి కార్యక్ర మాల కోసం దుబ్బాక జెడ్పీటీసీ కడ్తాల రవీందర్ రెడ్డి కేటా యించిన రూ.10 లక్షల ప్రొసీడింగ్ కాపీలను మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి శుక్రవారం దుబ్బాకలో అంద జేశారు. మండల పరిధిలోని కమ్మర్పల్లి గ్రామం నుంచి రేకులకుంట ఎల్లమ్మ దేవాలయానికి దారి కోసం రూ.4 లక్షలు, పెద్దగుండవెల్లి గ్రామంలో మరుగుదొడ్లు,నీటి సరఫరా కొరకు రూ.4 లక్షల 50 వేలు,చౌదర్ పల్లి గ్రామంలో మంచినీటి సదుపాయం కోసం రూ.1 లక్షా 50 వేలకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను సర్పంచ్లు పర్స నరస య్య, కుమ్మరెంకు కుమార్,సద్ది రాజిరెడ్డిలకు ఎంపీ, జెడ్పీట ీసీల చేతుల మీదుగా అందజేశారు.చీకోడ్ ఎంపిటిసి ఎల్. రాంరెడ్డి,ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ బక్కి వెంక టయ్య, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రొట్టె రాజ మౌళి, కొత్త కిషన్ రెడ్డి, పర్వతాలు, కరిపె రామచంద్రం, బత్తుల ఎల్లం, పలువురు ఉన్నారు.