Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరోగ్యానికి భరోసాగా సీఎంఆర్ఎఫ్
- హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ కుమార్
నవతెలంగాణ-హుస్నాబాద్
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్) ఎంతో భరోసా కల్పిస్తోందన్నారు. హుస్నాబాద్ నియో జకవర్గానికి చెందిన పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన చెక్కులను ఆయన ఇక్కడి తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం అందజేశారు. రూ.3.21 లక్షల విలువ గల చెక్కులు ఇచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఏ ప్రభుత్వ హయాంలో కూడా అనారోగ్య పీడితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇంత పెద్దమొత్తంలో ఆర్థిక సహాయం అందలేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమంపై పూర్తి భరోసా కల్పిస్తోందన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు కాలయాపన లేకుండా డబ్బులు అందుతున్నా యన్నారు.అనారోగ్యంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరి, లక్షలరూపాయలు ఖర్చు చేసుకొని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేదలకు సీఎం సహాయ నిధి అండనిస్తోందన్నారు.