Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 199 సర్వేనెంబర్లో అక్రమ నిర్మాణాలకు యత్నం
- ఆలయ భూములు సర్వే చేయించాలి
- ఆలయ ఈవోకు వాటాలు వెళ్తున్నాయని ఆరోపణ?
- సీపీఐ(ఎం) మండల కార్యదర్శి శెట్టిపల్లి సత్తిరెడ్డి
నవతెలంగాణ-కొమురవెల్లి
ఆలయ భూములు కబ్జాకు గురవుతున్నాయని వాటిని సంరక్షించాల్సిన ఆలయ కార్య నిర్వహణ అధికారి పట్టించుకోవడం లేదని సీపీఐ(ఎం) పార్టీ మండల కార్యదర్శి శెట్టిపల్లి సత్తిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోనీ పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్య కర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయానికి చెందిన భూ సర్వే నంబర్ 199లో అక్రమ కట్టడాలు నిర్మించేందుకు ఓ టీిఆర్‌ఎస్ నాయకుడు అతని బినామీతో సమాయత్తమవుతున్నాడని ఆరోపించారు. ఆలయ భూములను కాపాడాల్సిన ఈవో ఎలాంటి చర్యలు చేపట్టకుండా నిమ్మకుండిపోతున్నాడని తీవ్రంగా మండిపడ్డారు. ఆలయం వద్ద జరిగే ప్రతి అవినీతి పనిలో ఆలయ ఈవోకు వాటాలు వెళ్తున్నాయని అందుకే ఈఓ ఆంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆలయం వద్ద కీర్తిశేషుల లైన మల్లప్ప అనే వ్యక్తి.. సర్వేనెం బర్ 221లో గల అతని భూమిలో నుంచి మల్లన్న ఆలయా నికి సుమారు 2 ఎకరాలు అమ్మకాలు జరిపాడని.. అయితే ఆ సర్వేనెంబర్ ఆలయానికి అమ్మిన భూమిలో తక్కువ భూమి ఉండడంతో దానికి బదులుగా సర్వేనెంబర్ 217లో దేవస్థానముకు భూమి చూపించడం జరిగిందనీ అట్టి భూమిలో భక్తులు వసతి గహాలు కట్టించి దేవస్థానం కు ఇచ్చారన్నారు. కాగా మల్లప్ప అనే పట్టేదారుడు సర్వే నెంబర్ 217లో మొత్తం 8.5 ఎకరాలు మాత్రమే పట్టా కలిగి ఉండగా సుమారు 10.5 ఎకరాల వరకు అక్రమ రిజిస్ట్రేషన్లు చేశాడని ఆరోపణలు వస్తున్నాయి. అతని వద్ద భూ లావా దేవీలు జరిపిన ఓ ఆలయ అర్చకుడు చేసిన రిజిస్ట్రేషన్‌ను ఆసరాగా చేసుకుని సదరు టీఆర్ఎస్ నాయకుడు అతని బినామీతో నిర్మాణం చేపట్టడానికి పనులు మొదలు పెట్టాడన్నారు. మల్లప్ప దేవస్థానంకు అమ్మిన భూముల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని వాటిలో నెలకొన్న అనుమా నాలు నివత్తి చేయాల్సిన బాధ్యత ఆలయ ఈవో పై ఉందని వెంటనే భూములపై సర్వే నిర్వహించి ఆలయా భూములకు హద్దులు నిర్ణయించి ప్రహరీ గోడలు నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో భూముల సర్వే కొనసాగే వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయని ఆలయ ఈవో బాలాజీని హెచ్చరించారు. కోట్ల రూపాయల ఆదాయం ఉన్న మల్లన్న ఆలయానికి ఆలయ కార్య నిర్వహణ అధికారి ఇంచార్జ్ గా కొనసాగు తుండడం వల్లనే పలు అక్రమాలకు తావిస్తోందని వెంటనే పూర్తిస్థాయి అధికారిని కేటాయించాలంటూ ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రామ్ సాగర్ సర్పంచ్ తాడూరి రవీందర్, జిల్లా కమిటీ సభ్యులు బద్దిపడగ కష్ణారెడ్డి, నాయకులు చెరుకు వెంకటరెడ్డి, గోరేమియా, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.