Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ కుమార్
- ఘనంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు
నవతెలంగాణ-హుస్నాబాద్
ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కారుపై తెగించి కొట్లాడుతున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని, ఆయనను జాతీయ రాజకీయాల్లోకి పంపుదామని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివద్ధి చేసిన ఆయన దేశాన్ని కూడా ప్రథమ స్థానంలో నిలబెడతారన్నారు. జాతి ప్రయోజనాల కోసం దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చడానికి బయల్దేరాలని ఆకాంక్షించారు. శుక్రవారం హుస్నాబాద్ లో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా ప్రారంభిం చారు. మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొదటి రోజు నియోజక వర్గంలోని మహిళా సంఘాలతో జాతీయ జెండాలు చేతబట్టి ర్యాలీ నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్ యార్డు నుంచి ఆర్టీసీ బస్ డిపో వరకు భారీ ర్యాలీ చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లా డుతూ అలుపెరుగని ఉద్యమాలతో సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అభివద్ధికి చిరునామాగా మార్చారన్నారు. అదే ఉద్యమస్ఫూర్తితో దేశ గతిని కూడా మార్చడానికి ఆయన జాతీయ రాజకీయాల్లో అడుగుపె ట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కరువుకు చిరునామాగా ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత ఎలా ఉందో అందరికీ తెలిసిందే అన్నారు. టీఆర్ఎస్ పాలనా పగ్గాలు చేతబట్టిన తరువాత నియోజకవర్గం రూపురేఖలు మారిపోయాయ న్నారు. 2014కు ముందు ఇక్కడ తాగు, సాగునీరు లేక ప్రజలు అల్లాడిపోయేవారన్నారు. పల్లెల్లో సరైన రోడ్లు, వసతులు కూడా ఉండేవి కావన్నారు. కరెంటు ఎప్పుడు వస్తదో ఎప్పుడు పోతదో తెలియని పరిస్థితి ఉండేదన్నారు. అలాంటి స్థితి నుంచి ఇప్పుడు నల్లా తిప్పితే నీళ్లు వస్తున్నా యన్నారు. వరద కాల్వ, మిడ్ మానేరు ద్వారా నియోజక వర్గంలోని బీడు భూముల్లో పంటలు పండుతున్నా యన్నారు. కొద్ది రోజుల క్రితమే గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతమైందని చెప్పారు. నియోజకవర్గంలో సుమారు రూ. 150 కోట్లతో రోడ్లు నిర్మించినట్టు తెలిపారు. హుస్నాబాద్ ను ప్రత్యేక డివిజన్ గా ఏర్పాటు చేసి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కార్యాలయాలను ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఇక్కడ 50 పడకల మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిని నిర్మించబోతున్నట్టు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఐదువేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని, ప్రతి గ్రామ పంచాయతీకి ఒక కార్యదర్శిని నియమించిం దన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం అక్కన్నపేట మండలాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ఇవన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యదక్షతతోనే సాధ్యమయ్యాయని చెప్పారు. దేశం కూడా ఇలా అభివద్ధి చెందాలంటే ఆయన జాతీయ రాజకీ యాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఈకార్యక్రమంలో హుస్నాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత, వైస్ చైర్ పర్సన్ అయిలేని అనిత, హుస్నాబాద్ ఆర్డీవో జయచ ంద్రారెడ్డి, ఏసీపీ సతీశ్, మున్సిపల్ కమిషనర్ రాజమల్లయ్య ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ములుగు : గజ్వేల్ పట్టణ కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల కార్యక్రమ ంలోఎమ్మెల్సీ యాదవరెడ్డి ములుగు ఎంపీపీ ఉపాద్యక్షుడు దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఖ్యాతిని దేశ నలుమూలల వినిపించేలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించటం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణవ ున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో మంత్రి హరీశ్‌రావు పిలు పు మేరకు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి జనా భా దేశ ఔన్నత్యాన్ని, ఆత్మగౌరవాన్ని నిలిపే కార్యక్రమం లో పాల్గొన్నందుకు ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
కొండపాక : కొండపాక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ఘ నంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ ఇందిరాదేవి అధ్య క్షతన జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమం విషయా లను విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా విద్యా ర్థులు సమైక్య ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అధ్యాప కులు అమరేందర్ రెడ్డి, శ్రీదేవి, శశిధర్ రెడ్డి, రాము లు, అనిత, శ్రీ లీల, పాపయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.