Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుబ్బాక
దుబ్బాక పురపాలిక పరిధిలోని అన్ని వార్డుల్లో రూ.11 కోట్లతో సీసీ, బీటీి రోడ్లు, మురుగు కాలువల నిర్మాణ పనులకు రాష్ట్ర వైద్యారోగ్య,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చేతుల మీదుగా శుక్రవారం శంకుస్థాపన చేశారు. రూ.6 కోట్ల 50 లక్షలను మూడున్నర కిలోమీటర్ల మేర సిసి రోడ్లు,15 కిలోమీటర్ల మురుగు కాలువల నిర్మాణం కోసం,రూ.4 కోట్ల 50 లక్షలు బీటీ రోడ్ల నిర్మాణం కోసం ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. మంత్రి వెంట మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి,దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ గన్నె వనిత భూమిరెడ్డి,వైస్ చైర్ పర్సన్ అధికం సుగుణ బాలకిషన్ గౌడ్,మున్సిపల్ కౌన్సిలర్లు,కో ఆప్షన్ సభ్యులు,తెరాస నాయకులు,కార్యకర్తలు ఉన్నారు.