Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ
- పాల్గొన్న సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు
నవతెలంగాణ-ఐడిఏ బొల్లారం
బొల్లారం పారిశ్రామిక వాడలో సీసీ రోడ్లు వేయాలని, నిధులు కేటాయించాలని, కార్మికుల ప్రాణాలు కాపాడాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కే రాజయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం సిఐటియు ఆధ్వర్యంలో ఐడిఏ బొల్లారంలో వివిధ సెంటర్లలో రోడ్లు బాగు చేయాలని కోరుతూ సంతకల సేకరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసియా ఖండంలోనే పారిశ్రామిక వాడిగా పేరుగాంచిన బొల్లారంలో సీసీ రోడ్లు లేకపోవడం అత్యంత దుర్మార్గమన్నారు, ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదన్నారు, రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికవాడలను చాలా ప్రాధనతిస్తుందని, అభివద్ధి చేస్తున్నానని ఎన్ని ప్రకటనలు చేసిన బొల్లారంను చూస్తే అర్థమవుతుందని అన్నారు. ఈ ప్రాంతంలో నడవలేని పరిస్థితి ఉందని, టు వీలర్ సైతం పోలేని పరిస్థితి ఉందన్నారు. మామూలు వాహనాలు, భారీ వాహనాలు పరిశ్రమలకు పోయే పరిస్థితి లేదని, దీనిని ప్రభుత్వం వెంటనే పట్టించుకోని రోడ్లు వేయాలని ఆయన డిమాండ్ చేశారు. వీధిలైట్లు సైతం లేవన్నారు. వర్షాకాలం వస్తే చెరువులను తలపిస్తాయని అన్నారు. రోడ్లు వేయకపోతే కార్మికులను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. రోడ్లను ఎవరు పట్టించుకోకపోవడం విచారకరమని అన్నారు ,ప్రభుత్వం గానీ, అధికారులు ఎవ్వరు పట్టించుకోకుండా గాలికి వదిలేశారని విమర్శించారు. రోడ్లు బాగు లేక అనేక ప్రమాదాలు జరిగాయని, కార్మికులు గాయపడ్డారని, కాళ్లు ,చేతులు విరిగిన ఘటన ఉన్నాయని, చనిపోయారని కూడా ఆందోళన వ్యక్తం చేశారు. వాహనాలు పడిపోయినాయని అన్నారు, ఇక్కడ పరిశ్రమ యజమానులు పట్టించుకోవడం లేదు అటు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని అన్నారు, కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. రాత్రిపూట పరిశ్రమల నుండి ఇంటికి వెళ్లాలంటే కార్మికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిన దుస్థితి ఉందని అన్నారు, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు మధు, ఎన్ శ్రీనివాస్, తిరుపతి రెడ్డి, కృష్ణ, జీతయ్య, గజపతి, తదితరులు పాల్గొన్నారు.