Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రామచంద్రాపురం
నాటి హైదరాబాద్ సంస్థానం 1948 సెప్టెంబర్17న నిజాం రజాకార్ల నుంచి విముక్తి పొంది భారతదేశంలో విలీనమయిందన ఆరోజును ఎట్టి పరిస్థితిల్లోనూ విమోచన దినంగానే భావించాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు నరేందర రెడ్డి అన్నారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించి న సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ఇన్చార్జి జయ అట్లూరి రామకష్ణ, మాజీ మంత్రి బాబు మోహన్, అధికార ప్రతినిధి విట్టల్‌తో కలిసి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 75 సంవత్సరాల స్వతంత్ర హైదరాబాద్‌లో స్వాతంత్య్ర సమరయోధులను, అమరవీరులను స్మరించుకోవటానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అజాదికా అమత్ మహౌత్సవ సంబురాలు నేడు హైదరాబాద్ వేదికగా జరగనున్నా యన్నారు. నిజాం రజాకార్ల నుండి విముక్తిపొంది భారత దేశంలో కలిసినందుకుగాను సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా ప్రకటించాలని బీజేపీ డిమాండ్ చేస్తూనే ఉన్నదని.. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంఐఎం పార్టీకి భయపడి తన రాజకీయ లాభాపేక్ష కోసం జరపడం లేద న్నారు. మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విష్ణువర్ధన్‌రెడ్డి దేశ్‌పాండే, గోదావరి అంజిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మణరావు, ప్రధాన కార్యదర్శి ఎల్ మహేందర్, హనుమంత్ రెడ్డి, జిల్లా కార్యదర్శి కుమార్ అసెంబ్లీ కన్వీనర్లు నర్సారెడ్డి, శ్రీనివాస్ గుప్తా, రామచ ంద్రపు రం పట్టణ అధ్యక్షులు నర్సింగ్ గౌడ్, నాయకులు ఈశ్వర య్య ,ఆగారెడ్డి ,రాజశేఖర్ రెడ్డి, శ్రీకాంత్, నరేష్, యాదగిరి, పద్మావతి, అన్నపూర్ణ, మురళి తదితరులు పాల్గొన్నారు.