Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొగుట
బ్యాంకు రుణాలు సకాలంలో రెన్యూవల్ చేసుకో వడంతో అనేక లాభాలు కలుగుతాయని ఏపీజీవీబీ ఆర్ఓ ధన్రాజ్ గ్రామస్తులకు సూచించారు. శుక్రవారం మండ లంలోని జప్తి లింగారెడ్డిపల్లిలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు శాఖ ఆధ్వర్యంలో రైతులకు బ్యాంకు సేవల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. గ్రామస్థులు తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించకపోవడంతో జరిగే నష్టాల గురించి, రెగ్యులర్గా చెల్లిం చడంతో జరిగే లాభాలను గురించి వివరించారు. అలాగే బ్యాంకులో ప్రతి ఒక్కరు రూ.1000 బీమా పాలసీ తీసుకో వడంతో ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి ఇరవై లక్షల బీమా అందుతుందని సూచించారు. తీసుకున్న రుణాలను మండలంలోనే అధిక మొత్తంలో రెన్యూవల్ చేసిన గ్రామం జప్తి లింగారెడ్డి పల్లి గ్రామమే అన్నారు. అలాగే గోల్డ్ లోన్, ట్రాక్టర్ లోన్, అలాగే షాప్ లకు లోన్ పొంది క్రమం తప్పకుండా చెల్లించడంతో మంచి లాబాలను పొందవచ్చన్నారు. మేనేజర్ ప్రశాంత్,ఫీల్డ్ ఆఫీసర్ భరత్ కుమార్,సర్పంచ్ జ్యోతి మల్లారెడ్డి,ఉప సర్పంచ్ సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.