Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2016 ఆర్పీడీ చట్టం పటిష్టంగా అమలు చేయాలి
- సెప్టెంబర్ 23న కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా
- వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏం అడివయ్య డిమాండ్
నవతెలంగాణ-నారాయణఖేడ్
వికలాంగులందరికీ ప్రత్యేక రేషన్ కార్డులు మంజూరు చేయడంతోపాటు 2016 ఆర్పీడీ చట్టం పటిష్టంగా అమలు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏం అడివయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సమాశంలో అడివయ్య పాల్గొని మాట్లాడారు. 40 శాతం అంగవైకల్యం కలిగిన వికలాంగులు ఆహార భద్రత కార్డు పొందేందుకు అర్హులని జూలై 4నాడు పౌరసరఫరాల శాఖ జీవో నెంబర్ 13 ను విడుదల చేసిందన్నారు. జీవో వచ్చి రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఎక్కడ కూడా వికలా ంగులకు ప్రత్యేక రేషన్ కార్డులు ఇవ్వలేద న్నారు. ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో వికలాంగులకు ఎక్కడ కూడా ఐదు శాతం వాటా ఇవ్వడం లేదన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో వికలాంగులకు వాటా ఇవ్వకు ంటే కట్టిన డబుల్ బెడ్ రూమ్లను ఆక్రమించు కుంటామని హెచ్చరించారు. వికలాంగుల పట్ల సమాజంలో చిన్న చూపు ఏర్పడుతుందని అంగవైకల్యం పేరుతో సంబోధిస్తూ వికలాం గుల అవమాన పరుస్తున్నారన్నారు. చట్టాలను అమలు చేయాల్సిన ముఖ్యమంత్రి వికలాంగులను అవమానపరిచే విధంగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిం చారు. అందరికీ 2016 ఆర్పీడీ చట్టం అమలులోకి వచ్చి 6 ఎండ్లు అవుతుం దన్నరు. ఇప్పటికీ చట్టంలో పేర్కొన్న అనేక అంశాలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.సెక్షన్24 ప్రకారం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో 25 శాతం అదనంగా చెల్లించాలని చట్టంలో ఉన్న కల్యాణ లక్ష్మీ పథకం మినహా మిగిలిన పథకాల్లో ఎందుకు అమలు చేయలేదన్నారు.సెక్షన్ 21ప్రకారంప్రభుత్వ ప్రైవేట్ సంస్థలో ర్యాంపులు నిర్మించడం లేదని అన్నారు. తీవ్ర వైకల్యం కలిగిన వికలాంగులు వారి సహాయకులకు ప్రత్యేక అలవెన్స్ మంజూరు చేయాలని కోరారు. వికలాంగుల పై వేధింపులు, అవమనలు అరికట్టేందుకు చట్టంలో ఉన్న సెక్షన్ 91, 92లను ఎందుకు అమలు చేయడం లేదని అన్నారు. జిల్ల స్థాయిల్లో వికలాంగుల కో ఆర్డినేషన్ కమిటీ సమావేశాలు జరపడం లేదన్నారు. జిల్లా అధ్యక్షులు ఏం బస్వరజ్ పాటిల్ మాట్లాడుతూ... వికలాంగుల సమస్యలపై ప్రతి 3నెలలకు ఒక్కసారి సమీక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. చట్టం గుర్తించిన 21రకాల వైకల్యాలకు ధవీకరణ పత్రాలు ఇవ్వడం లేదని తక్షణమే 21రకాలకు సర్టిఫికేట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి జిల్లా కేంద్రంలో స్టడీ సర్కిల్ ఎర్పాటు చేయాలనీ డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న బ్యాక్ లాక్ పోస్టులను భర్తీ చేయడానికి కషి చేయాలని కోరారు. రాష్ట్ర కమిటీ సభ్యులు బుక్క ఇస్మాయిల్, నియోజక వర్గం నాయకులు ప్రకాష్ రావు, లక్ష్మన్, దత్తు, గోపాల్ రెడ్డి, లక్ష్మి, ఫర్జానా, మంగమ్మ, తుకారాం, రాములు, శోభారాణి, సమేల్ తదితరులు పాల్గొన్నారు.