Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పటాన్చెరు
కమ్యూనిస్టులే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారసులని సీపీఐ(ఎం) పటాన్ చెరు ఏరియా కార్యదర్శి ఎన్ నర్సింహారెడ్డి అన్నారు. శుక్రవారం ఆ పార్టీ అధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా పట్టణంలోని శ్రామిక భవన్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నర్సింహారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 1946లో ప్రారంభమై1951 వరకు కొనసాగిం దన్నారు. ఇందులో కీలకమైన అంశం 1948 సెప్టెంబర్ 17 న భారత దేశంలో నైజాం ఎస్టేట్ విలీనం కావడం చారిత్రిక వాస్తవం అని తెలిపారు. ఆనాడు ఉద్యమంతో సంబంధం లేని పార్టీలు,నాయకులు సాయుధ పోరాటం పై నేటికీ చరిత్రను వక్రీక రిస్తున్నారని అన్నారు. బీజేపీ, అర్ఎస్ఎస్ ముస్లింల నుంచి విముక్తి కలిగిందని, దీని ద్వారా విమోచన లభించిందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలం గాణ రైతాంగ సాయుధ పోరాటం భూమి, భుక్తి, వెట్టిచాకిరి నుండి విముక్తి కావడం కోసం ఆనాడు కమ్యూనిస్టుల అధ్వర్యంలో జరిగిందన్నారు.సాయుధ పోరాట ఫలితంగా 10 లక్షల ఏకరాల భూమిని కమ్యూనిస్టులు పంచి పెట్టారని గుర్తు చేశారు.3 వేల గ్రామాల్లో గ్రామ రాజ్యాలను స్థాపిం చారని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులు అని అన్నారు. ఈ పోరాట స్ఫూర్తి తో ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ నాయకులు బి నాగేశ్వరరావు, గంగాధర్,రాంచందర్, ఇతరులు పాల్గొన్నారు.