Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్
తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన అనభేరి ప్రభాకర్ స్ఫూర్తిగా పల్లె పల్లెకు సీపీఐని తీసుకెళ్తామని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ మండలంలోని మహ మ్మదాపూర్ గుట్టల్లో తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన వారికి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అటు పిమ్మట గ్రామ ంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడాతూ.. తెలంగాణ సాయుధ పోరాటానికి బీజేపీకి సంబంధం ఏంటని ప్రశ్నించారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో హుస్నా బాద్ నుంచి పోటీ చేస్తామన్నారు. తెలంగాణ సాయుధ పోరాట అమరులను మరువలేమని కొనియా డారు. జిల్లా కార్యదర్శి మంద పవన్ , కోహెడ సజన్ కుమార్, మండల కార్యదర్శి గడిపే మల్లేష్, మడిశెట్టి శ్రీధర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.