Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్
నవతెలంగాణ-పటాన్చెరు
తెలంగాణ సచివాలయం దేశానికే ఆదర్శం అని, అంబేద్కర్ పేరుతో చరిత్ర పుటల్లోకి తెలంగాణ గర్వపడే నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలు గర్వపడుతున్నారని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ అన్నారు. శుక్రవారం పటాన్చెరు మండలం చిట్కుల్లో నీలం మధు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి, సీఎం చిత్రపటానికి పాలభిషేకాలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ సచివాలయానికి భారత రాజ్యంగ నిర్మాత పేరు పెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడంతో దేశం గర్విస్తున్నదన్నారు. ఓ వైపు దళిత అభ్యన్నతికి అహర్షిషలు శ్రమిస్తూనే మరో వైపు అంబేద్కర్ ను సగర్వంగా గౌరవించుకోవడంలో సీఎం కేసీఆర్ ముందు న్నారన్నారు. పార్లమెంట్ నూతన భవనానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రతిపా దించిన విషయాన్ని మధు గుర్తు చేశారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు ఎందుకు పెట్టడం లేదని విమర్శలు చేసిన ప్రతిపక్షాలు ఇప్పడు ఏమంటాయని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ గొప్ప దార్శనికుడు, మానవతావాది, సామాజిక దృక్ఫతం ఉన్నవారని, సీఎంకు ఒకరు చెప్పాల్సిన, సూచిం చిన అవసరం లేదన్నారు. అద్భుతమైన, దేశ గర్వపడే నిర్ణ యాలు తీసుకోవడంలో పథకాలు అమలు చేయడంలో కేసీఆర్కు మరొకరు సాటిరారన్నారు. తెలంగాణ పథకాలు ఇప్పుడే దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, దళిత బంధు పథకంతో దళిత కుటుంబాల్లో కొత్త వెలుగులు నిండుతు న్నాయన్నారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు నిర్ణయాన్ని తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు మెచ్చుకుంటూ ముఖ్యమంత్రి పాలభిషేకాలు చేస్తున్నారని, దేశంలో ఇలాంటి సీఎం ఏ రాష్ట్రానికి లేరన్నారు. తెలంగాణ ప్రజల తరపున కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అద్బుతమైన పాలన అంది స్తున్న సీఎం కేసీఆర్ దేశ చరిత్రలో నిలిచిపోతారని మధు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, వార్డు సభ్యులు దుర్గయ్య, కృష్ణ, వెంకటేష్, భుజంగం, మురళీ, వెంకటేశ్, రాజ్ కుమార్, ఆంజనేయులు, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.