Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిద్దిపేట
వైద్య విద్య పట్ల ప్రజలలో, విద్యార్థులలో అవగాహన కొరకు మెడ్ ఎక్స్ పో - 22 కార్యక్రమం ద్వారా వైద్య విద్య ప్రదర్శనను వైద్య విద్యార్థులు శుక్రవారం మెడికల్ కళా శాలలో ఏర్పాటు చేయగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. విద్యార్థులు శరీరం లోపల ఉన్న అవయవాలను ప్రదర్శించారు. వాటి యొక్క పని తీరును, అవి చెడిపోతే ఎలా మారుతాయి, వాటి వల్ల కలిగే అన ర్ధాలు, వాటిని బాగు చేసుకునే విధానాన్ని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులు ఏర్పాటు చేసిన మెడ్ ఎక్స్ పో చాలా బాగుందన్నారు. నిజమైన అవయవాలను ప్రదర్శించారని, విద్యార్థులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు ఈ రెండు రోజులపాటు ఉండే ఎగ్జిబిషన్ ను తిలకించి, మన అవయవాల పైన అవగాహన పెంచు కోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, వైద్య కళాశాల వైద్యులు, వైద్యశాఖ అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
నిరుపేదలకు సీఏం సహాయ నిధి ఓ వరం..
నిరుపేదలకు సీఏం సహాయ నిధి ఓ వరమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్ధిపేటలోని తన నివాసంలో శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని 207 కుటుంబాలకు రూ.72 లక్షల 01 వెయ్యి రూపాయల సీఏంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు మంత్రి అందజేశారు.
-పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం..
నియోజకవర్గ పరిధిలోని ప్రతీ టీఆర్ఎస్ కార్యకర్త కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. నియోజకవర్గ పరిధిలో ఇప్పటి వరకూ ప్రమాదంలో మతి చెందిన 38 మంది పార్టీ కార్యకర్తల కుటుంబాలకు పార్టీ ఇన్సూరెన్స్ ద్వారా రూ.76 లక్షలు రూపాయల ఆర్థిక సాయం అందజేసినట్లు మంత్రి తెలిపారు. సిద్ధిపేట అర్బన్ మండలం ఏన్సాన్ పల్లి గ్రామానికి చెందిన బీరం భాగవ్వ విద్యుద్ఘాతంతో మృతి చెందగా వారి కుమార్తె బీరం మమత, అలాగే బూర్గుపల్లి గ్రామానికి చెందిన బందెల వినోద్ కుమార్ ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందగా అతడి తండ్రి బందెల కనకయ్యకు రూ.2 లక్షల రూపాయల చొప్పున పార్టీ ఇన్సూరెన్స్ చెక్కులను మంత్రి అందజేశారు.