Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రామచంద్రాపురం
రామచంద్రాపురంలోని బిహెచ్ఇఎల్ కంపెనీ యూని ట్‌కు బెస్ట్ ఆర్గనైజేషన్ అవార్డు లభించింది. దేశంలో క్వాలిటీ సర్కిల్ ఉద్యమానికి మద్దతు ఇచ్చే ఉత్తమ సంస్థగా బెల్ కంపెనీ ఎంపిక అయింది. హైదరాబాదులోని బేగంపేటలో గల మేరీ గోల్డ్ హౌటల్లో 36వ వార్షిక చాప్టర్ కన్వెన్షన్ 2022లో క్వాలిటీ సర్కిల్ ఫోరం ఆఫ్ ఇండియా హైదరా బాద్ చాప్టర్ ఈ అవార్డును ప్రధానం చేసింది. ఈ కార్యక్ర మానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ పరిశ్రమలు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ విచ్చేసి ఆయన చేతుల మీదుగా అవా ర్డు ప్రధానం నిర్వహించారు. బెల్ అధికారులు జనరల్ మేనే జర్ శ్రీనివాస్ ,ఏజీఎం అశోక్ కుమార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తరపున ఈ అవార్డును అందుకున్నారు. బెల్ కంపెనీకి అవార్డు రావడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.