Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీిఆర్‌ఎస్ సర్కారుకు ప్రజా సంక్షేమం,పేదలే ఎజెండా
- కులమత,రాజకీయాలకతీతంగా దుబ్బాకను అభివృద్ధి చేసుకుందాం
- వైద్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ-దుబ్బాక
ఆకలి,పేదలు లేని తెలంగాణ నిర్మాణమే సీఎం కేసీఆర్ సంకల్పమని ,ప్రజా సంక్షేమం పేదలే ఎజెండాగా ప్రజాకాంక్షలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ సర్కారు పనిచేస్తున్నారని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. దుబ్బాకలో ఏడేళ్ల క్రితం సాగు, తాగునీరు, కరెంటు కష్టాలు ఉండేవని.. కేసీఆర్ సీఎం అయ్యాకే ఆ కష్టాలు తీరాయన్నారు. ఏడేళ్ల క్రితం రూ.200 ఉన్న పెన్షన్ నేడు రూ.2016కు పెంచిందని టీఆర్ఎస్ ప్రభుత్వమే అని గుర్తు చేశారు. శుక్రవారం నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాక పురపాలికలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ సభకు ముఖ్యఅతిథిగా మంత్రి హాజరయ్యారు. అంతకుముందు శివాజీ విగ్రహ కూడలి నుండి పోచమ్మ దేవాలయం వద్ద ఏర్పాటుచేసిన సభాస్థలి వరకు జాతీయ జెండాలను పట్టుకొని సమైక్యత ర్యాలీలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావుతో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్యంలోకి అడుగుపెట్టి 75 ఏళ్లవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 3 రోజుల పాటు తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను నిర్వహిస్తున్న దన్నారు. దుబ్బాక ప్రాంతం నుండి ఏళ్ల తరబడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ధర్నాలు, పాదయాత్రలు, నిరాహార దీక్షలు, ఉద్యమాలు చేసి ఎంతోమంది జైల్లలో పడ్డారని వారి వీరోచిత పోరాటం, దుబ్బాక గడ్డను తెలంగాణ సమాజం మరువబోదని స్పష్టం చేశారు. విద్యా ర్థులు శ్రద్ధగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గిరిజన పాఠశాలల్లో చదువుతున్న 4 లక్షల మంది విద్యార్థులకు ప్రతీఏడాది రూ.3300 కోట్లు తమ ప్రభుత్వం వెచ్చిస్తుందని తెలిపారు. 350 మంది ఎస్సీ రెసిడెన్షియల్ విద్యార్థులు ఏఐజి లో డాక్టర్లుగా సీట్లు సాధిస్తే వారిని సన్మానించామని చెప్పారు. త్వరలోనే ఇంటడుగు జాగలో ఇల్లు నిర్మించుకునేందుకు రూ.3 లక్షల సాయాన్ని కెసిఆర్ సర్కారు అందిస్తుందన్నారు. కుల మతాలు,రాజకీయాలకు అతీతంగా ఉండి దుబ్బాకను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుని తద్వారా అద్భుత ప్రగతిని సాధించుకుందామని మంత్రి హరీష్ రావు కోరారు. అంతకుముందు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి,దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునం దన్ రావులు మాట్లాడారు. డీిఆర్డీఓ పిడి గోపాల్ రావు, సిద్దిపేట ఆర్డిఓ అనంతరెడ్డి, తహసిల్దార్ ఎండి సలీం మియా, మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి,ఎంపీడీవో భాస్కర శర్మ,దుబ్బాక మున్సిపల్ చైర్ పర్సన్ గన్నె వనిత భూమిరెెడ్డి, వైస్ చైర్ పర్సన్ అధికం సుగుణ బాలకిషన్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు,జడ్పిటిసి కడతాల రవీందర్ రెడ్డి,దుబ్బాక మిరుదొడ్డి ఎంపీపీ లు కొత్త పుష్ప లత కిషన్ రెడ్డి,గజ్జెల సాయిలు, నియోజకవర్గ స్థాయి ఎంపీపీ లు, జడ్పిటిసిలు, ఎంపిటిసిలు,సర్పంచ్‌లు,ఇతర ప్రజా ప్రతినిధు లు, మున్సిపల్ ఆర్పి లు, అంగన్వాడిలు,ఆశా లు, వెలుగు సమాఖ్య ప్రతినిధులు,టీఆర్ఎస్ భాజపా నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.