Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జహీరాబాద్
రాజీ మార్గమే రాజా మార్గమని సీనియర్ సివిల్ జడ్జి సూర్య కృష్ణ అన్నారు. శనివారం మండల లీగల్ సర్వీసెస్ కమిటీ జహీరాబాద్ ఆధ్వర్యంలో స్థానిక కోర్ట్ కాంప్లెక్స్‌లో బ్యాంకు లోక్ అదాలత్‌ను జూనియర్ సివిల్ జడ్జి అనూష తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. రాజీ మార్గంలో కేసులు పరిష్కారం చేసుకోడానికి ఖాతాదారులకు మంచి అవకాశమన్నారు. వన్ టైమ్ సెటిల్మెంట్ పద్దతి ద్వారా బ్యాంకు కేసులు సత్వర పరిష్కారం చేసుకొని విలువైన సమయాన్ని, డబ్బుని ఆదా చేసుకోవాలని సూచించారు. ఎవ్వరైనా అపరిష్కృతంగా ఉన్న కేసుతో సతమతమౌతుంటే గనక వారు స్థానిక మండల లీగల్ సర్వీసెస్ కమిటీని సంప్రదించవచ్చని తద్వారా కేసు సత్వర పరిష్కారం చేయడానికి వీలు పడుతుందని అన్నారు. ఈ సదవకాశాన్ని ఖాతాదారులు వినియోగించు కోవాలని సూచించారు. కార్యక్రమంలో బార్ ప్రెసిడెంట్ దత్తాత్రేయ రెడ్డి, న్యాయవాదులు, బ్యాంకు అధికారులు, ఖాతాదారులు, లీగల్ సర్వీసెస్ సిబ్బంది మరియు పారా లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు.
23 కేసుల పరిష్కారం
లోకదాలత్ నందు చిట్ ఫండ్లకు సంబంధించిన 23 కేసులను పరిష్కరించి సుమారు రూ.37 లక్షల వరకు ఆయా సంస్థలకు ఇప్పించడం జరిగిందన్నారు.