Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జహీరాబాద్
తల్లులకు పౌష్టికాహారం అందించినప్పుడే పుట్టబోయే బుడ్డ శారీరకంగా మానసికంగా ధృఢంగా పుడుతుందని ఇఫ్కో మేనేజర్ సుభాష్ రెడ్డి అన్నారు.శనివారం డి.డి.ఎస్-కె.వి.కె ఆధ్వర్యంలో పోషన్ అభియాన్ను కొత్త మహిందర కాలనీలో నిర్వహించారు. అందులో భాగంగా ఇఫ్కో మేనేజ ర్ సుభాష్ రెడ్డి, సిద్దు, కేవీకే శాస్రవేత్తలు, సీడీపీఓ, అంగన్వాడీ టీచర్స్, సూపర్వైజర్స్ పాల్గొన్నారు. అనంతరం ఇఫ్కో మేనేజర్ సేంద్రియ ఎరువులపైన అవగాహనా కల్పిం చారు. సీడీపీఓ సునీత రోజూతినే పోషకాహారం, వాటి విలు వల గురించి తెలిపారు. అంజమ్మ సూపర్ వైసర్ పోషణ అభియాన్ కార్యక్రమం గ్రామంలో మరింత చేరాలని.. అది ప్రతీ ఒక్కరి బాధ్యత అని అంగన్వాడీ టీచర్లకు తెలిపారు. జ్యోతి అంగన్వాడీ సూపర్ వైసర్ మాట్లాడుతూ.. కిషోరక బాలికలను ఉద్దెశించి పోషకాహారం గురించి.. భవిష్యత్లో ఎలా ఉండాలో వివరించారు. స్నేహలత సస్య రక్షణ శాస్ర వేత్త మాట్లాడుతూ.. పెరటి తోటల పెంపకం గురించి వివరి ంచారు. రమేష్ శాస్ర వేత్త చిరు ధన్యల ప్రాముఖ్యత వాటిలో ఉండే పోషకాలు గురించి వివరించారు. స్వామి భూసారా పరీక్ష నిపుణులు భూమి ఆరోగ్యాంగా ఉండాలంటే ఎటువంటి యాజమాన్యలు చేయాలో వివరించారు. కేవికె సీనియర్ సైంటిస్ట్ హెడ్ సురేష్ దగాడే మాట్లాడుతూ.. కెవికెలో జరిగే పనుల గురించి, ఫాతకాలంలో తీసుకున్న ఆహారానికి ఇప్పుడు తీసుకుంటున్న ఆహారానికి గల తేడాలు వివరింంచి ప్రతి ఒకరు మంచి పౌష్టిక ఆహారం తీసుకోవాలని వివరించారు. 40 మంది అంగన్వాడీ టీచర్స్, 20 మంది శిషోర బాలికలు, 15 మంది 6 ఏండ్ల పిల్లలు మరియు డిడి యస్ కెవికే సిబ్బంది పాల్గొన్నారు.