Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాఠశాల ఆవరణలో అపరిశుభ్రత
- నిరుపయోగంగా మరుగుదొడ్లు
నవతెలంగాణ-పుల్కల్
పుల్కల్ ఉమ్మడి మండల పరిధిలోని బొమ్మారెడ్డి గూడెంలో లక్షల రూపాయలు వెచ్చించి గిరిజన విద్యార్థుల కోసం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను నిర్మించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు మెరుగైన విద్య కల్పించాలనే ఉద్దేశంతో ఈ పాఠశాలను నిర్మించి.. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యాభ్యాసం అందిస్తున్నది. అయితే స్థానిక సిబ్బంది నిర్లక్ష్యంతో ఈ పాఠశాల ఆవరణలో అపరిశుభ్రత గుప్పుమం టోంది. మరుగుదొడ్లు సరిగ్గా లేవు. పాఠశాల చుట్టూ అపరిశుభ్రత నెలకొనడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. ఈ పాఠశాలలో సుమారు 200కు పైగా విద్యార్థులు ఉన్నారు. కాగా ఇందులో 9 మంది ఉపాధ్యా యులు విధులు నిర్వహిస్తున్నారు. అయితే పాఠశాల బాగోగులు చూసుకోవాల్సిన ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ పాఠశాల సమస్యలకు వలంగా మారిందంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రాత్రి వేళల్లో విష సర్పాలు సైతం వచ్చిన సందర్భాలు ఉన్నా యని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు పాఠశాల ప్రిన్సిపాల్ ధృష్టికి తీసుకెళ్ళినప్పటికీ ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. ఈ వసతి గృహానికి వచ్చే నిధులను పక్కదోవ పట్టించి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. నాణ్యతలేని భోజనం పెట్టడంతో విద్యార్థులు పలు రకాల రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ వసతి గృహంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించి.. వసతి గృహం వార్డెన్ పై తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.