Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వట్పల్లి
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా మండలంలో జాతీయ పతాక ఆవిష్కరణను ప్రభుత్వ కార్యాలయాల వద్ద మొక్కుబడిగానే ఎగురవేశారు. 75 ఏండ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈనెల 16న వజ్రోత ్సవాలను ఘనంగా నిర్వహించినప్పటికీ.. 17న ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీల వద్ద జాతీయ పతాక ఆవిష్కరణ నామమాత్రంగా నిర్వహించారు. మీడియాకు ఆహ్వానం పంపకపోవడంపై పలువురు మీడియా వాళ్లు ప్రశ్నించగా తమ కార్యాలయాలకు అధికారిక ఉత్తర్వులు అందలేదని అధికారులు సమాధానం ఇవ్వడం గమనార్హం. ఏది ఏమైనా జెండా పతాక ఆవిష్కరణలు మొక్కుబడిగానే జరుపుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా ఆయా గ్రామాల్లో పార్టీలకతీతంగా తమ కార్యాలయాల వద్ద పతాకావిష్కరణ చేపట్టారు. తాసిల్దార్ ప్రభూలు, డిప్యూటీ తహసీల్దార్ శంబీరెడ్డి, ఎంపీపీ పత్రి కృష్ణవేణి నర్సింలు సర్పంచ్ సురేఖ బుద్ధి రెడ్డి, ఎంపీటీసీ ఇందిరా బారు రాజు, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అశోక్‌గౌడ్, మాజీ ఎంపీటీసీ టీఆర్ఎస్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శివాజీ రావు తదితరులు పాల్గొన్నారు.