Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జోగిపేట
విశ్వకర్మ జయంతి సందర్భంగా జోగిపేటలో విశ్వబ్రా హ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో శనివారం స్థానిక మాణిక్ ప్రభు మందిరంలో శ్రీ మద్విరట్ విశ్వకర్మ భగవా నుడుకి పూజలు నిర్వహించారు. విశ్వకర్మ బంధువులందరూ కలసి విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆం దో ల్ మండల అధ్యక్షుడు మనుమల చారి మాట్లాడుతూ.. ఈ జయంతి ఉత్సవాలను దిగ్విజయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సంగా రడ్డి జిల్లా ఉపాధ్యక్షులు అనిల్ చారి, ముత్తయ్య చారి, వేణు చారి, వెంకటేశం చారి, సత్యనారాయణ చారి, ఉపాధ్యా యులు నాగరాజు, బ్రహ్మం, వీరేశం, శ్రీనివాస్ చారి తదితరులు పాల్గొన్నారు.
గుమ్మడిదల : మండల పరిధిలో మనుమయ త్వష్ట శిల్పి విశ్వజ్ఞలు కలిసి విశ్వకర్మ జయంతి పురస్కరించుకుని గ్రామంలోని రాముల వారి దేవాలయం పక్కన విశ్వకర్మ విగ్రహాలు, చిత్రపటాలను ఏర్పాటు చేసి విశ్వకర్మల అంతా ఏకమై యజ్ఞంతోపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ జయంతి వేడుకలు అన్నారం, బొంతపల్లి గుమ్మడిదల కానుకుంట తదితర గ్రామాలలో నిర్వహించారు. గ్రామ విశ్వకర్మ సంఘం అధ్యక్షుడు కె దామోదర్ చారి, ఉపాధ్యక్షుడు సత్యనారాయణ చారి, కోశాధికారి మల్లేశం చారి, ప్రధాన కార్యదర్శి కే రామచంద్ర చారి, కార్యనిర్వాహణాధికారి కే సత్యనారాయణ చారి, కార్యవర్గ సభ్యులు రవీందర్ చారి, శంకరాచారి, కానుకుంట మండల అధ్యక్షుడు భార్గవ చారి,గ్రామ అధ్యక్షుడు వీరచారి, సంఘము పెద్దలు ముద్రిక చారి,వీరచారి,వడ్ల నర్సింహ చారి, కమ్మరి నర్సింహ చారి తదితరులు పాల్గొన్నారు.