Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సాపూర్
నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడాన్ని స్వాగతిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి పాలాభిషేకఎం చేశారు. శనివారం నర్సాపూర్ పట్టణంలోని క్యాంపు కార్యాలయం వద్ద టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పాలా భిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో దళితుల ఆరికాభివృద్ధి కోసం దళితబందు ప్రవేశ పెట్టిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. దళితులు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎదగడా నికి నిరంతరం ఆలోచిస్తూ వారి అభ్యున్నతికి కృషి చేస్తున్న మహనీయుడన్నారు.మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అనసూయ అశోక్‌గౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి, మునిసిపల్ వైస్ చైర్మన్ నహీం, మాజీ ఎంపీపీ రమణా రావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శేఖర్, పట్టణాధ్యక్షుడు బిక్షపతి, సర్వేష్ తదితరులు ఉన్నారు.