Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరమ్మతుల్లో తీవ్ర జాప్యం
నవతెలంగాణ-వట్పల్లి
మండల కేంద్రమైన వట్పల్లిలో రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసిన నిఘా నేత్రాలు నేడు విద్యుత్ స్తంభాలకే పరిమితమై ఉత్సవ విగ్రహాలుగా మారి నిరుపయోగంగా దర్శనమిసు న్నాయి. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమా నమని.. సీసీ కెమెరాల ఏర్పాటుతో దొంగతనాలను అరికట్ట వచ్చని గతంలో ఫెస్టిసైడ్, ఫర్టిలైజర్ వ్యాపారస్థుల వద్ద విరాళాలు సేకరించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
అయితే ఏడాదిగా నిఘా నేత్రాలు టెక్నికల్ సమస్యలతో పనిచేయడం లేదు. దీంతో దొంగలను పట్టుకోవడంలో పోలీసులకు ఇబ్బందులు తప్పడం లేదు. మరోపక్క మండ లంలో దొంగతనాలు విపరీతంగా జరుగుతూనే ఉన్నాయి. సీసీ కెమెరాలు ఉండి ఉంటే ఇంతలా దొంగతనాలు జరిగేవి కావని స్థానికులు అంటున్నారు. కాగా ఇక్కడ విధులు నిర్వ హించిన సబ్ ఇన్స్పెక్టర్ దశరథ్ బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో వచ్చిన అధికారులు కూడా సీసీ కెమెరాల మర మ్మత్తుల విషయమై జాప్యం చేస్తూనే ఉన్నారు. 6 నెలల క్రితం మండల కేంద్రమైన వట్ పల్లి గ్రామంలో ఒక ఇంట్లో 5 తులాల బంగారం కొంత నగదును, అదేవిధంగా వట్టిపల్లి గొర్రెకల్ రోడ్డులో రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంటిలో అద్దెకు ఉన్న గొర్రెకల్ గ్రామానికి చెందిన బోయిని మోహన్ బైకును గుర్తుతెలియని వ్యక్తులు బైకులు దొంగిలించారు. అయితే ఇప్పటివరకు ఆ కేసుల్లో పురోగతి లేకుండా పోయింది. బంగారాన్ని గానీ, బైక్ను గానీ పోలీసులు పట్టుకోలే కపోయారు. నిఘా నేత్రాలు ఉపయోగంలో ఉంటే దొంగ తనాలు జరిగినా.. వెంటనే వారిని పట్టుకోవడానికి అవకాశ ం ఉండేది. కాగా 6 నెలల క్రితం నుండి మరమ్మ తులు చేప ట్టాలని పోలీస్ అధికారులు భావిస్తున్నప్పటికీ నేటికీ పనులు ముందుకు సాగలేదు. వేలు ఖర్చు చేసి సీసీ కెమెరాలను వ్యాపారస్తుల సహకారంతో ఏర్పాటు చేసిన ప్పటికీ నిధుల లేమితో మరమత్తులో జాప్యం జరుగు తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా వెంటనే సీసీ కెమెరాలను మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు.
త్వరలోనే మరమ్మతులు చేపడుతాం
మండల కేంద్రంలో ప్రధాన కూడ ళ్లలో ఏర్పాటుచేసిన నిఘా నేత్రా లను త్వరలోనే మరమ్మతులు చేపడతాం. టెక్నికల్ ప్రాబ్లంతో మరమ్మతుల జాప్యం జరుగుతున్నది. అంతేకాకుండా నిధుల సమస్య కూడా ఉన్నది. అయినను త్వరలోనే మరమ్మతులు చేయించేందుకు కృషి చేస్తాం.
-ఎస్సై అంబర్య