Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు
- బంజారా భవన్‌కు తరలిన గిరిజనులు
నవతెలంగాణ-జహీరాబాద్
గిరిజనుల సంక్షేమం కేసీఆర్ తోనే సాధ్యమని ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు.హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రారంభించిన ఆదివాసీ, బంజారా భవన్ల ప్రారంభోత్సవం బహిరంగ సభ కార్యక్రమానికి శాసనసభ్యులు కొనింటీ మాణిక్‌రావు ఆధ్వర్యంలో జహీరా బాద్ నియోజకవర్గం నుంచి గిరిజన మహిళలు, నాయ కులు భారీగా తరలి వెళ్లారు. ఈ వాహనాలకు ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ లేని విధంగా గిరిజన తాండాలన్నింటిని గ్రామపంచాయతీగా మార్చి వాటి అభివద్ధికి నిధులు కేటాయించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. జెడ్పీటీసీ మోహన్ రెడ్డి, డిస్ట్రిక్ట్ సొసైటీ డైరెక్టర్ కిషన్ పవర్, మాజీ కౌన్సిలర్ మోతిరాం, సర్పంచ్ ఫోరమ్ అద్యక్షులు రవి కిరణ్, శంకర్ నాయక్, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, నాయకులు ఇజ్రాయేల్ బాబీ, సంపత్, వాసు నాయక్, విజరు రాథోడ్, సంజు నాయకు లు, అధికారులు జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, ఆర్డీఓ రమేష్ బాబు, ఎంపీడీవోలు తదితరులు ఉన్నారు.
పటాన్చెరు : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఆదివాసుల ఆరాధ్య దైవం కొమరం భీమ్, గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ బంజారా భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం సాయంత్రం నిర్వహించిన భారీ బహిరంగ సభకు పటాన్ చెరు నియోజకవర్గంలోని వివిధ తాండాల నుండి గిరిజనులు బయలుదేరి వెళ్లారు. పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. నియోజకవర్గంలోని ఆరు తాండాల నుంచి ఆరు బస్సుల్లో సభకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయంలో గిరిజనులు తమ సాంప్రదాయ వేషాధనతో నిర్వహించిన సంస్కతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అనంతరం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని గిరిజనుల అభివద్ధికి అన్నివేళలా అండగా నిలుస్తున్నామని తెలిపారు. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజరు కుమార్, ఎంపీపీలు దేవానందం, సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసిలు సుప్రజా వెంకట్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, నియోజకవర్గ ప్రత్యేక అధికారి ప్రసాద్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, వివిధ శాఖల అధికారులు, గిరిజన ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
నారాయణఖేడ్ : హైదరాబాదులో జరుగుతున్న వజ్రో త్సవాల సందర్భంగా బంజారా భవన్‌కు నాగల్గిద్ద మండ లంలోని ఇరాక్‌పల్లి గ్రామ మేఘానాయక్ తాండా పంచా యతీ గిరిజన సోదరులు సర్పంచ్ అనిత -శివరాం, ఎంపీ టీసీ కిషన్ నాయక్ ఆధ్వర్యంలో సుమారుగా 50 మంది వరకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా సర్పంచ్, ఎంపీటీసీ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరా ్వత తాండాలను కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేశారని.. అలాగే నేడు బంజారా భవనాన్ని కూడా నిర్మించారని కొని యాడారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పంచాయతీ మెంబర్లు గణపతి రాథోడ్, బానో వత్ బాబు, జాదవ్ రూప్ సింగ్, రాథోడ్ జైపాల్, జాదవ్ జైను తండా ప్రజలు రాథోడ్ తుకారాం,రాథోడ్ దేవుదాస్, రాథోడ్ జగనాథ్, బానోత్ శేషు,జాదవ్ దేవిధస్,రాథోడ్ తులసిరామ్, రాథోడ్ పండరి, జాదవ్ జైపాల్, రాథోడ్ నాగేష్, బానోవత్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
జిన్నారం : మండల పరిధిలోని రాళ్ల కత్వ తాండాకు చెందిన గ్రామస్తులు శనివారం హైదరాబాదులో నిర్వ హించిన బంజారా భవన్ వేడుకలకు తరలి వెళ్లారు. రాళ్ల కత్వలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సంగారెడ్డి జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ కుంచాల ప్రభాకర్ జెండా ఊపి బస్సును ప్రారంభించారు. స్థానిక ఎంపీటీసీ స్వాతి ప్రభాకర్‌రెడ్డి, ఆది రామకష్ణ, జింక దేవేందర్, శశాంత వర్మ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హత్నూర : మండలంలోని తెల్లరాళ్ల తాండా, కొత్తగూడెం, దేవుని గుట్ట తాండాలతో పాటు పలు తాండాల నుంచి గిరిపుత్రులు సేవాలాల్ బంజారా భవన శంకుస్థాపనకు శనివారం హైదరాబాద్ తరలి వెళ్లారు. ఈ సందర్భంగా తెల్లరాళ్ల తాండా సర్పంచ్ రవీంద్ర నాయక్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు సేవాలాల్ బంజారా భవనం శంకుస్థాపన చేయనున్నడంపై హర్షం వ్యక్తం చేశా రు. దౌల్తాబాద్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి హైదరాబాద్ కు తరలి వెళ్లారు. నామ్యా నాయక్, శ్రీరాములు, ఎంపీటీసీ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.