Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జహీరాబాద్
మహిళలను ఇబ్బందుల గురి చేసే పోకిరీలు ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని సిఐ తోట భూపతి అన్నారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. జహీరాబాద్ పట్టణం లోని శాంతినగర్‌కు చెందిన 9 మంది పోకిరీ యువకులు ఇతరుల ఇండ్ల ముందుకు వెళ్లి అల్లరి చేయడం, రోడ్లపై వెళుతున్న మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించడం లాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్న ఎనిమిది మంది యువకులపై కేసు కట్టి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈనెల 14న జావేద్ షాకీర్ అనే అన్నదమ్ములను 9 మంది యువకులు కలిసి రాడ్లు, కట్టెలు, పదునైన చాకుతో దాడి చేయడంతో వారు హైదరాబాద్‌లోని వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉందని సీఐ తెలిపారు.ఈ పోకిరిల వ్యవహారాన్ని వ్యతిరేకించినట వారిపై దాడి చేసి గాయపరచడమే లక్ష్యంగా పెట్టుకున్నారని తమ విచారణలో తేలిందన్నారు. ఈ విధమైన దుశ్చర్యలకు పాల్పడుతున్న వారు ఎంతటి వారైనా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఇదే మాదిరిగా వ్యవహారాన్ని కొనసాగిస్తే వారిపై రౌడీషీట్లను కూడా ఓపెన్ చేస్తామన్నారు. ఈ విలేకర్ల సమావేశంలో ఎస్సై శ్రీకాంత్ సిబ్బంది పాల్గొన్నారు.