Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ కుమార్
నవతెలంగాణ-హుస్నాబాద్
ఉమ్మడి రాష్ట్రంలో సమస్యలతో సతమతమవుతూ తల్లడిల్లిన గిరిజన తండాలు స్వరాష్ట్ర పాలనలో సంబురంగా ఉన్నాయని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ అన్నారు. శనివారం హైదరాబాద్ లో జరిగిన బంజారా, ఆదివాసీ ఆత్మగౌరవ సభకు హుస్నాబాద్ నుంచి తరలివెళ్లిన గిరిజనుల వాహనాలకు ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. తన క్యాంపు కార్యాలయం నుంచి అనబేరి ప్రభాకర్ రావు విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లారు. గిరిజనుల నత్యాలకు అడుగులు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాక ముందు గిరిజన తండాల పరిస్థితి ఎలా ఉండేదో అందరికీ తెలుసన్నారు. రోడ్లు, విద్యుత్తు, నీళ్ల సౌలత్ లేక తల్లడిల్లేవారని తెలిపారు. స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. ఇప్పుడు తండాలు గ్రామ పంచాయతీలుగా అవతరించాయని, ప్రతి తండాకు అద్దంలాంటి రోడ్డు ఉందన్నారు. విద్యుత్తు, నీళ్ల సమస్య అసలే లేకుండా చేశామని చెప్పారు. వ్యవసాయంపై ఆధారపడి బతికే గిరిజనులకు పాడి పశువులు, గేదెలను ఇస్తామన్నారు. గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీకగా రూ. 2.20కోట్లతో హుస్నాబాద్ లో బంజారా భవన్ నిర్మించనున్నట్టు తెలిపారు. హుస్నాబాద్, అక్కన్నపేట ఎంపీపీలు లకావత్ మానస, మాలోత్ లక్ష్మి, అక్కన్నపేట జెడ్పీటీసీ భూక్య మంగ, మాజీ జెడ్పీటీసీ బీలునాయక్ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ సమైక్యత ర్యాలీకి తరలి వెళ్లిన నాయకులు
నవతెలంగాణ-తొగుట
జాతీయ సమైక్యత ర్యాలీకి మండలంలోని అన్ని గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలి వెళ్లారని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జిడిపల్లి రాంరెడ్డి, వైస్ ఎంపీపీ బాసి రెడ్డి శ్రీకాంత్ రెడ్డి, సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు సిరినేని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. శనివారం ఎంపీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్ రెడ్డిని కలిశారు.