Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హరీశ్‌రావుకు కె.రాజయ్య లేఖ
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
ఐడీఏ బొల్లారం, కాజిపల్లి, గడ్డపోతారం పారి శ్రామిక వాడల్లో రోడ్లు బాగు చేయాలని కోరుతూ రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రా వుకు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కె.రాజయ్య బహిరంగ లేఖ రాశారు. సంగారెడ్డిలోని సుందరయ్య భవన్లో శనివారం రాసిన లేఖను ట్విట్టర్ ద్వారా మంత్రికి పంపినట్లు తెలిపారు. బొల్లారం, కాజిపల్లి, గడ్డపోతారం పారిశ్రామిక వాడల్లో సీసీ రోడ్లు వేయా లని, అందుకు అవసరమైన నిధుల్ని మంజూరు చే యాలని లేఖలో కోరారు. రోడ్లు అధ్వానంగా మార డం వల్ల నిత్యం ప్రయాణించే కార్మికులు ప్రమాదా లకు గురై ప్రాణాలు కోల్పోతున్నట్లు తెలిపారు. ఆసి యా ఖండంలోనే పారిశ్రామిక వాడగా పేరుగాంచిన బొల్లారంలో సీసీ రోడ్లు లేకపోవడం దుర్మార్గమ న్నారు. పారిశ్రామిక ప్రాంతంలో రోడ్ల నిర్మాణం, మర మ్మతులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. పారిశ్రామికాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, పారిశ్రామి క వాడల్లో సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని సీఎం, రాష్ట్ర మంత్రులు అనేక ప్రకటనలు చేస్తున్నప్పటికీ ఆచరణలో చేసిందేమీ లేద న్నారు. కనీసం నడవలేని దుస్థితిలో రోడ్లు ఉన్నాయ న్నారు. ద్విచక్ర వాహనాలు నడపలేని పరిస్థితి ఉందన్నారు. భారీ వాహనాలు పరిశ్రమలకు వెళ్లలేక ప్రమాదాలకు గురవుతున్నాయన్నారు. వీధిలైట్లు లేక చీకటిమయంగా మారిందన్నారు. వర్షాకాలంలో వరద నీరు చేరి చెరువుల్ని తలపించేలా రోడ్లు మారుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, పరిశ్రమల యజమాన్యాలు, అధికారులెవ్వరూ పట్టించుకోవడం లేదన్నారు. రోడ్లు అధ్వానంగా ఉండడం వల్ల కార్మికులు ప్రమాదాలకు గురై గాయాల పాలైన సందర్భాలున్నాయన్నారు. కొందరికి కాళ్లు, చేతులు విరిగి ఉద్యోగాలు చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందని గుర్తు చేశారు. మరి కొందరు చనిపోయారని తెలిపారు. రాత్రిపూట డ్యూటీ మీద వెళ్లాలంటే కార్మికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పారిశ్రామిక వాడల్లో సీసీ రోడ్లను నిర్మించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సీఐటీయూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.