Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు
నవతెలంగాణ-సంగిరెడ్డి
వెట్టి చాకిరీ విముక్తి కోసం సాయుధ పోరాటం నడిపింది ఎర్రజెండా మాత్రమేనని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు అన్నారు. మతోన్మాద బీజేపీకి ప్రజా పోరాటాల చరిత్రే లేదన్నారు. తెలంగాణలో మతోన్మాద వ్యతిరేక భావజాలం బలపడాలన్నారు. నిజాం బూచీ చూపి సాయుధ పోరాటానికి మతం రంగు పులిమే కుట్రను బీజేపీ చేస్తోందన్నారు. వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా మట్టి మనుషులు ఎర్రజెండా నీడన పోరాడిన తర్వాతనే జాగీర్లు, జమీన్దార్లు, దేశ్‌ముఖ్‌లు పారిపోయారని తెలిపారు. తద్వారా నిజాం హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసేందుకు సిద్ధపడ్డాడన్నారు. కమ్యూనిస్టుల పోరాటాన్ని తక్కువ చేస్తూ యూనియన్ సైన్యం వల్లనే నిజాం లొంగిపోయినట్లు జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. నిజాం కాలంలో ఉర్దూ ప్రాభల్యం వల్ల చదువు నేర్చుకునే అవకాశం లేదన్నారు. సెప్టెంబర్ 17 తర్వాతనే తెలుగులో చదువుకునే అవకాశం పెరిగి సామాజిక ఆంశాలపై చైతన్యం పెరిగిందన్నారు. అలా ఆంధ్రమహాసభ నాయకత్వాన సాయుధ రైతాంగ పోరాటం ఊరూరా వ్యాపించి గెరిల్లా దళాలు గ్రామ రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారన్నారు. మహత్తర పోరాట వారసత్వం కల్గిన సీపీఐఎం విస్తరణ కోసం మరింత శక్తివంతంగా పని చేయాలని కోరారు. సీపీఐఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు మాట్లాడుతూ అమర వీరుల త్యాగాల వల్లనే తెలంగాణకు విముక్తి లభించిందన్నారు. నిజాం నిరంకుశ పానలలో సబ్బండ వర్గాలు వెట్టిచేశాయన్నారు. దొరలు, భూస్వాముల ఆగడాలు భరించలేని విధంగా ఉండేవని న్నారు. ఈ విషయం చరిత్ర పుటలు తిరగేస్తే అర్ధమవుతుందన్నారు. ఈ సభకు పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బీరం మల్లేశం అధ్యక్షత వహించగా జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.రాజయ్య, అతిమేల మాణిక్యం, రామచందర్, నర్సింహారెడ్డి, సాయిలు, సీనియర్ నాయకులు వాజీద్‌అలీ, జిల్లా కమిటీ సభ్యులు నర్సింహులు, యాదవరెడ్డి, ఆర్.శ్రీనివాస్, మహిపాల్, ప్రవీణ్‌కుమార్, చిరంజీవి, విద్యాసాగర్, లక్ష్మీ, రేవంత్‌కుమార్, పాండురంగారెడ్డి, అశోక్, బాగారెడ్డి, రాజిరెడ్డి, నాగేశ్వర్రావు, మల్లేశం పాల్గొన్నారు.