Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిహారం ఇవ్వట్లేదని వినతి
నవతెలంగాణ-సంగారెడ్డి
జహీరాబాద్ నిమ్జ్ కోసం భూముల్ని కోల్పోయిన బాధిత రైతులు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను కలిశారు. శనివారం సంగారెడ్డి పట్టణానికి వచ్చిన సందర్భంగా ఆయన్ను పలువురు రైతులు కలిసి తమ భూములు తీసుకున్న ప్రభుత్వం తగిన నష్టపరిహారం ఇవ్వట్లేదని తెలియజేస్తూ వినతిపత్రం అందజేశారు. బాధితులమైన తమ పక్షాన సీపీఐ(ఎం) పోరాడుతోందన్నారు. జహీరా బాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లో నిమ్జ్ కోసం భూముల్ని తీసుకున్నారే తప్ప తగిన పరిహారం ఇవ్వడంలేదని తెలిపారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం తమకు పరిహా రం ఇవ్వాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం అమలు చేయడంలేదన్నారు. రెవెన్యూ అధికారులు బెదిరించి భూముల్ని లాగేసుకుంటున్నా రన్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని మా చిరెడ్డిపల్లి, బిడేకన్నె, పీచరాగడి, సత్త్వార్ గ్రామాలకు చెందిన పలువురు పారెస్ట్, వక్ఫ్ భూముల పేరుతో తమ భూములకు కొత్త పాసుపుస్తకాలు ఇవ్వడంలే దని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో అసైన్డ్ చేసి పట్టా దారు పాస్తుకాలు ఇచ్చారని తెలిపారు. భూముల్లో తామే కబ్జాలో ఉంటూ కాస్తు చేసుకుంటున్నామని తెలిపారు. ధరణి వెబ్సైట్ వచ్చాక తమ భూములకు పాసుపుస్తకాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నా రని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం చేస్తోందని డీఎస్పీ 1998 క్వాలీఫైడ్ అభ్య ర్థులు తమ్మినేని కలిసి విన్నవించారు. దశాబ్దాలు గడుస్తున్నా తమకు ఉద్యోగాలివ్వకుండా ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తోందన్నారు. సీఎం కేసీఆర్ తమకు న్యాయం చేస్తానని ఇచ్చిన హామీ నేటికీ అమలు కావడం లేదన్నారు. సీపీఐ(ఎం) తమ సమస్య గురించి పోరాడి న్యాయం జరిగేలా చూడాలని కోరారు.