Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆనాటి కవులను స్మరించుకుందాం
- వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు
నవతెలంగాణ-సిద్దిపేట
చరిత్రలో 1948 సెప్టెంబర్ 17కి ఒక విశిష్టత ఉందనీ, 74 సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారిందనీ, రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందిందనీ, జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నామని, ఇటీవలనే భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను దేశంలో ఏ రాష్ట్రం నిర్వహించనంత ఘనంగా నిర్వహించుకున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా మంత్రి హరీష్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసు గౌరవ వందన స్వీకరించారు, అనంతరం ఆయన మాట్లాడుతూ ఆనాటి యోధుల త్యాగాలు వెలకట్టలేనివని, ఆ త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఆదివాసీ యోధుడు కుమ్రం భీమ్, తన అమరత్వంతో చరిత్రను వెలిగించిన దొడ్డి కొమురయ్యలతో పాటు నాటి పోరాటానికి నాయకత్వం వహించిన మహనీయులు రావి నారాయణ రెడ్డి, స్వామి రామానంద తీర్థ, భీంరెడ్డి నర్సింహారెడ్డి, వీర వనిత చాకలి ఐలమ్మ, ప్రజా ఉద్యమానికి సేనాధిపతిగా నిలిచిన ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్, దేవులపల్లి వేంకటేశ్వర్ రావు, బద్దం ఎల్లారెడ్డి వంటి ప్రజానేతల త్యాగాలను సగర్వంగా స్మరించుకుందామన్నారు. తమ అక్షరాలతో ప్రజల్లో ఉత్తేజాన్ని నెలకొల్పిన సురవరం ప్రతాపరెడ్డి, ప్రజాకవి కాళోజి, మగ్దూం మొహియుద్దీన్, దాశరథి కృష్ణమాచార్య, సుద్దాల హనుమంతు, బండి యాదగిరి, షోయబుల్లాఖాన్ వంటి సాహితీమూర్తులకు ఘనమైన నివాళులర్పిద్దామన్నారు. జాతీయ సమైక్యతా అంటే భౌగోళిక సమైక్యత మాత్రమే కాదనీ, ప్రజల మధ్య సమైక్యత, విభిన్న సంస్కతుల మధ్య సమైక్యత, దేశం అనుసరిస్తున్న జీవనసూత్రం భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడడమే నిజమైన దేశభక్తి అని అన్నారు. 75 ఏళ్ళ స్వతంత్ర భారతంలో తెలంగాణ 60 సంవత్సరాల పాటు అస్తిత్వం కోసం ఉద్యమించిందనీ, సీఎం కేసీఆర్ నేతత్వంలో 14 ఏళ్ల పోరాటం , అమరుల త్యాగ ఫలితం , 4కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చి నేడు స్వరాష్ట్రమై అన్ని రంగాల్లో అద్భుతమైన అభివద్ధిని సాధిస్తూ, అనతికాలంలోనే దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా రూపుదాల్చిందన్నారు. నాలుగు దశాబ్దాల పైగా నాన్చివేతకు గురైన సిద్దిపేటకు జిల్లా హౌదా దక్కడంతో పాటు పోలీస్ కమిషనరేట్‌గా మారిందనీ, స్వరాష్ట్రం సిద్దించిన రెండేళ్లలోనే ముఖ్యమంత్రి సిద్దిపేట ప్రజల చిరకాల వాంఛకు గొప్ప పరిష్కారం చూపించారనీ అన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను తెచ్చి పారిస్తున్నామనీ, మన జిల్లాలోని అన్నపూర్ణ, రంగనాయకసాగర్, శ్రీ కొమురవెల్లి మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లు నిండుకుండలను తలపిస్తున్నాయనీ, గౌరవెల్లి రిజర్వాయర్ ద్వారా గోదావరి నీళ్లు మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ నేలలను స్పశించడం అద్భుత ఘట్టమనే అని అన్నారు. విద్య, వైద్యము, ఉపాధి రంగాలలో జిల్లా బాగా అభివద్ధి చెందిందని అన్నారు. జిల్లాలో అన్ని రకాల వైద్య సేవలు అందుతున్నాయని, పేదలకు వైద్యంలో ఒక పైసా ఖర్చు కాకుండా ఉచిత సేవలు అందిస్తున్నామన్నారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఎస్సీ కార్పొరేషన్ నుంచి మంజూరైన పథకాలను లబ్ధిదారులకు మంత్రి అందించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ రోజా శర్మ , కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, పోలీస్ కమిషనర్ శ్వేత , జిల్లా అధికారులు పాల్గొన్నారు.