Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ/తూప్రాన్ రూరల్ (మనోహరాబాద్)
మద్విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలను శనివారం రోజు విశ్వబ్రాహ్మణ విశ్వకర్మసంఘం సభ్యులు ఘనంగా నిర్వహించారు. స్థానిక బ్రహ్మంగారి దేవాలయంలో విశ్వకర్మ యజ్ఞం అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా విశ్వకర్మ సంఘం అధ్యక్షులు సుగుణాల నారాయణచారి ఆధ్వర్యంలో మున్సిపల్ పరిధిలోని పోతరాజ్పల్లిలో విశ్వకర్మ పతాకావిష్కరణ చేసివిశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బొంది రాఘవెందర్గౌడ్, కౌన్సిలర్ లావణ్య దుర్గారెడ్డి, నాయకులు అంజయ్య యాదవ్, మండల విశ్వకర్మ సంఘం అధ్యక్షులు సరాఫ్ సతీష్చారి, రాఘవచారి, శ్రీధరచారి, అరిపాక భూషణంచారి, బ్రహ్మచారి, దయానంద్చారి, వెంకట్చారి పాల్గొన్నారు.
నవతెలంగాణ-మెదక్ రూరల్
విశ్వకర్మ తనంతట తాను స్వయంభూరూపమై అవతరించిన మహానీయుడని, అన్ని దిక్కులను చూడగల్గిన అమితమైన శక్తి కలవాడని జిల్లా కలెక్టర్ ఎస్. హరీశ్ కొనియాడారు. విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విశ్వకర్మ నాలుగు యుగాలలో ఎన్నో పట్టణాలను నిర్మించాడని సత్య యుగంలో దేవతలకోసం స్వర్గలోకం, త్రేతాయుగంలో శివుడి కోసం సువర్ణ లంకను, ద్వాపర యుగంలో ద్వారక నగరంను, కలియుగంలో హస్తినపురాన్ని నిర్మించారన్నారు. సృష్టి తొలినాళ్ళనుంచి సుప్రసిద్ధులైన ఐదుగురు శిల్ప కళాకారులను సృష్టించిన మహానీయుడన్నారు. కమ్మరి, వడ్ల, కంచరి, కాష, అవుసుల సామాజిక వర్గానికి చెందిన విశ్వకర్మకు జన్మించిన వారేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, అదనపు కలెక్టర్లు ప్రతిమ సింగ్ రమేష్ అదనపు ఎస్పీ బాలస్వామి బీసీ అభివృద్ధి అధికారి కేశూరం, ఏబీసీడీ డివో యం. నాగరాజు గౌడ్ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర కార్యదర్శి శంకరయ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులు భువనేశ్వరి శ్రీనివాస చారి ప్రధాన కార్యదర్శి కపాచారి కోశాధికారి కుబేరుడు పట్టణ అధ్యక్షులు వెంకటేష్ జిల్లా కార్యవర్గ సభ్యులు బ్రహ్మం సాయిబాబ తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-మద్దూరు
విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి కార్యక్రమాన్ని మద్దూరు మండల కేంద్రంలో విశ్వకర్మ బ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షులు పానుగంటి తిరుపతయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వకర్మ జయంతి సందర్భంగా గణపతి పూజ విశ్వకర్మ భగవాన్ అష్ట నామాలు, మంత్ర పుష్పార్చనలు, మంగళహారతి భజన సంకీర్తన నడుమ ఘనంగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ సంఘం మాజీ అధ్యక్షులు తాటికొండ బ్రహ్మానంద చారి, తాటికొండ సిద్ధిరాములు చారి, గ్రామ శాఖ అధ్యక్షులు రాళ్ల బండి కృష్ణమాచారి, ఎర్రోజు కనకాచారి, ఉల్లెందుల బిక్షపతి చారి, వలబోజు సిద్దేశ్వర చారి, ఉప్పల వెంకటేశ్వర్లు చారి, మాసంపల్లి మల్లేశం చారి, సలేంద్రి కనుక చారి పాల్గొన్నారు
నవతెలంగాణ-పెద్దశంకరంపేట్
పెద్దశంకరంపేట స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో పేట లోని రామాలయంలో శనివారం విశ్వకర్మ జయంతి వేడుక లను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయంలో విశ్వకర్మ భగవానుని ప్రతిష్టించి వేద బ్రాహ్మణ పండితుల మంత్రోచ్ఛారణలతో హౌమం, ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. విశ్వకర్మ జయంతి జెండాను ఎగరవేసి పట్టణ పుర వీధుల గుండా స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో యువకులు భారీ ర్యాలీ నిర్వహించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై విశ్వకర్మ భగవానుని విగ్రహాన్ని ప్రతిష్టించి పట్టణ పురవీధుల గుండా ఊరేగిస్తూ తిరుమలాపూర్ చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో మండల స్వర్ణకార సంఘం బాధ్యులు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
నవతెలంగాణ-కొల్చారం
విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని మండల కేంద్రమైన కొల్చారం గ్రామంలోని స్థానిక కాళికాదేవి ఆలయ ప్రాంగణంలో విశ్వానికి సృష్టికర్త విశ్వకర్మ భగవానుని జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జెండా ఆవిష్కరించిన అనంతరం మండల విశ్వకర్మ ఐక్య సమితి అధ్యక్షులు ప్రభాకర్ మాట్లాడారు. విశ్వకర్మ జయంతిని ప్రభుత్వం అధికారకంగా జరపడం శుభపరిణామం అన్నారు. అలాగే గ్రామస్థాయిలో ఉన్న విశ్వకర్మలకు పనులు లేక దీనావస్తలో బ్రతుకులు వెల్లదీస్తున్నారని తెలిపారు. అందుకోసం ప్రభుత్వం 50 సంవత్సరాలకే పద్మశాలీలకు, గీత కార్మికులకు ఇచ్చిన విధముగా విశ్వకర్మలకు కూడా 50 సంవత్సరాలకే పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కోశాధికారి పాండురంగ చారి, గ్రామాధ్యక్షులు దుర్గపతి చారి, ఉపాధ్యాక్షులు బ్రహ్మం చారి, కష్ణమూర్తి చారి, దశరథం చారి, నరసింహ చారి, శ్రీనివాస్ చారి, కరుణాకర్ చారి, హరీష్ చారి, శివకుమార్ చారి, రాజు చారి తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-తొగుట
విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు నిర్వహించారు. శనివారం మండలంలోని కాన్గల్ గ్రామపంచాయతీ ఆవరణలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ప్రేమల చంద్రారెడ్డి, వైస్ ఎంపీపీ బాసి రెడ్డి శ్రీకాంత్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ దోమల కొమురయ్య, పీఏసీఎస్ డైరెక్టర్ శ్రీధర్, ఎస్ఎంసి చైర్మన్ ముడీకే కనకయ్య,విశ్వకర్మ సంఘం సభ్యులు సత్యం చారి, వీరాచారి, బాబుల్ చారి, యాదగిరి చారి, నరసింహ చారి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-హవేలీ ఘనపూర్
హవేలి ఘనపూర్ మండలంలోని శనివారం ఘనంగా విశ్వకర్మ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా జగద్గురు విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎక్కలా దేవి శ్రీపాల్, శ్రీనివాస్, నవీన్ చారి, రామచంద్రం చారి, ఫణి రాజు చారి, రమేష్ చారి, కృష్ణమూర్తి చారి, శంకర్ చారి, సిద్ధిరాములు చారి, తదితరులు పాల్గొన్నారు.