Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎస్కే వలీఅహ్మద్
నవతెలంగాణ-జగదేవపూర్
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి బలమైన పోరాటాలే శరణ్యమని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు ఎస్కే వలీఅహ్మద్ అన్నారు. టీఎస్‌యూటీఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కేజీబీవీ సందర్శిస్తూ జిల్లా కార్యదర్శి గజ్వేల్ వెంకట్ కిరణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉపాధ్యాయులకు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లు, బదిలీల షెడ్యూల్ విడుదల చేసి దసరా సెలవులలో కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలను ప్రకటించాలన్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలిపారు. కస్తూర్బా పాఠశాలలు, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించా లన్నారు. జీవో 317 ద్వారా నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలన్నారు. బ్లాక్ చేసిన 13 జిల్లాల స్పౌజ్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు గ్యార ప్రవీణ్ కుమార్, ఎం.శివుడు, నాయకులు చేరియాల కృష్ణ, జి.రాంచంద్రం తదితరులు పాల్గొన్నారు.