Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొగుట
విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలని జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి సూర్యప్రకాష్ సూచించారు. తొగుట రాంపూర్ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ పార్టీలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్య అతి కీలకమని, సమయాన్ని వృథా చేయకుండా సద్వినియోగం చేసు కోవాలన్నారు. వైద్య రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న సందర్భంగా విద్యార్థులు వైద్య విద్యపై దృష్టి సారించాలని కోరారు. విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామన్నారు. మెరుగైన ప్రగతి కనపర్చాలన్నారు. తొగుట జూనియర్ కళాశాల విద్యార్థులు మొదటి నుంచి మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారని ప్రశంసించారు. చదువుతో పాటు క్రమశిక్షణ అవసరమని ఎస్ఐ కర్ణాకర్రెడ్డి తెలి పారు. ప్రతి అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంతకుముందు కళాశాల విద్యార్థులు సాంస్కతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇంటర్మీడియట్ ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సూర్యప్రకాష్, ప్రిన్సిపాల్ గన్న బాలకిషన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి, సర్పంచ్ బొడ్డు నర్సింలు, జర్నలిస్టులను ఘనంగా సన్మానించారు.