Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీవి మాటలే తప్ప చేతలుకావు
- రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
- కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన కొండ శ్రీనివాస్
నవ తెలంగాణ - సిద్దిపేట
ప్రజా సంక్షేమంపై బీజేపీకి పట్టింపు లేదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్న సంక్షేమ పథకాలు, తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసి ఆ పార్టీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. శుక్రవారం సిద్దిపేటకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఉమ్మడి మెదక్ జిల్లా ఎస్సీ సెల్ మాజీ కన్వీనర్ కొండ శ్రీనివాస్ తన అనుచరులతో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి మంత్రి హరీశ్‌రావు గులాబీ కండువాలు కప్పి స్వాగతించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ ఇంటి పార్టీగా ముద్రపడిందన్నారు. ఈ రాష్ట్రంలో బీజేపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీల నియోజకవర్గాల్లో వారు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయకపోవడంతోపాటు కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్రం అడ్డుకుంటుందని ఢిల్లీ నేతలు చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. రాష్ట్రానికి కేంద్రం నుండి న్యాయంగా రావాల్సిన నిధులు ఎన్ని. మంజూరైన నిధులు ఎన్ని అనే అంశాలపై బహిరంగ చర్చకు దిగుతామని సవాల్ విసిరారు. ఈ రాష్ట్రానికి చెందిన బిజేపీ నేతలు ఇచ్చిన స్క్రిప్ట్‌ను చదివితే అబద్దాలు, ఆరోపణలు మాత్రమే ఉంటాయని సూచించారు. అంబ్కేదర్ ఆశయాలను ఆచరించే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. దళితుల కోసం బిజేపీ పార్టీ ఏమీ చేయడంలేదని మండిపడ్డారు. దళితులు, గిరిజనులు, ఆదివాసీల అభ్యున్నతి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి పాటుపడుతున్నారని గుర్తు చేశారు. ఎంతోమంది ఆత్మబలిదానాలు, కేసీఆర్ పోరాట ఫలితంగా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడం ఎవరి తరం కాదన్నారు. ఉద్యమ నేతనే ముఖ్యమంత్రి కావడంతో రాష్ట్రంలో అభివద్ధి వేగవంతమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ పగటి కలలు కంటున్నదని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవాచేశారు. తెలంగాణ రాష్ట్రంలో బిజేపీ,కాంగ్రెస్‌లకు చోటు లేదని స్పష్టం చేశారు. పట్టణానికి చెందిన కొండ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం ఆయన రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఎస్సీ సెల్ మాజీ కన్వీనర్‌గా, అధికార ప్రతినిధిగా, సీఎస్ఐ చర్చి మాజీ కార్యదర్శిగా పనిచేసిన శ్రీనివాస్ గత 25ఏళ్లుగా కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. నాయకులు శ్రీనివాస్, శ్రీనివాస్‌రెడ్డి, విజరుకుమార్, స్వామి, ప్రశాంత్, మహేశ్, మల్లేశం, బాలు, దుర్గారెడ్డి, శ్రీధర్, భాస్కరచారి, వెంకటేశ్, యాదగిరి, రాజిరెడ్డి తదితరులు టీఆర్ఎస్లో చేరారు, ఈ కార్యక్రమంలో టి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు కొం డం సంపత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.