Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కష్టపడి చదువుతూ ఉన్నత శిఖరాలను చేరాలి
- ఫ్రెషర్స్ డే వేడుకల్లో హుస్నాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రజిత
నవతెలంగాణ-హుస్నాబాద్
పాఠశాల, కళాశాలల్లో సీనియర్ విద్యార్థులు జూనియర్లకు ఆదర్శంగా ఉండాలని హుస్నాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ లోని మోడల్ స్కూల్, కాలేజీతోపాటు అపోలో ఒకేషనల్ జూనియర్ కాలేజీలో ఫ్రెషర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రజిత మాట్లాడుతూ సీనియర్ విద్యార్థులను జూనియర్ విద్యార్థులు అనుకరిస్తారని, అందుకే సీనియర్లు చదువు, ఆటపాటలతో పాటు నడవడికలో ఆదర్శంగా ఉండాలని అన్నారు. విద్యార్థులు లక్ష్యాలు ఏర్పరచుకోవాలన్నారు. ఏర్పరచుకున్న లక్ష్యాలను అధిగమించేందుకు ప్రణాళికాబద్ధంగా చదవాలని సూచించారు. తల్లిదండ్రుల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ అన్నపూర్ణ కొత్తగా చేరిన విద్యార్థులకు సాదర స్వాగతంతో పాటు వారి భవిష్యత్తుకు భరోసా ఇచ్చారు. తన విద్యార్థి దశలోని కొన్ని సరదా సంఘటనలను చెప్పుకొస్తూ విద్యార్థులను ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు. విద్యార్థుల్లో నిబిడీకతమైన సజన్మాతకతను వెలికితీస్తూ, వారు ఉన్నత శిఖరాలకు చేరుకునేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. జీవితంలో విద్యార్థి దశ చాలా కీలకమైందన్నారు. చెడు ఆలోచనల వైపు దష్టి మళ్లించకుండా మంచివైపుగా ఆలోచించాలని సూచించారు. ప్రణాళికాబద్ధంగా చదవటంతోపాటుగా ఎంచుకున్న సబ్జెక్టులపై సమగ్ర అవగాహన పెంచుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్రన్నారు. జీవన నైపుణ్యాలను అలవర్చుకోవడం, పర్సనాలిటీ డెవలప్మెంట్ను పెంచుకోవడం ద్వారా ఆత్మ విశ్వాసం పెరుగుతుందన్నారు. తద్వారా ఏ రంగంలోనైనా విజయం సాధించటానికి అవకాశం ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కొంకటి నళినీదేవి, ఒకేషనల్ కళాశాల డైరెక్టర్ వేముల అంజయ్య, ప్రిన్సిపాల్ గణేశ్, అధ్యాపకులు మమత, ప్రవీణ్, అనిత, సుజాత, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.