Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బతుకమ్మ చీరల పంపిణీలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి
నవతెలంగాణ-నర్సాపూర్
మహిళా సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. శుక్రవారం శివంపేట మండల పరిధిలోని కొంతన్ పల్లి గుండ్లపల్లి దొంతి శభాష్ పల్లి గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వం నుంచి వచ్చిన బతుకమ్మ చీరలను ఆయా గ్రామాల మహిళలకు ఎమ్మెల్యే మ దన్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని కు లాలను గౌరవించే విధంగా అధికారికంగా పండ గలను నిర్వహిస్తున్నారన్నారు. మహిళలను గౌరవిం చే విధంగా బతుకమ్మ చీరలను ప్రభుత్వం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అనంతరం ఆయా గ్రామాల్లో లబ్ధిదారులకు మంజూరైన పింఛన్ కార్డు లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకట్ రెడ్డి, జెడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా, ఎంపీపీ కల్లూరు హరికృష్ణ, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రమణ గౌడ్ ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.