Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షులు నత్తి మల్లేష్ముదిరాజ్
నవతెలంగాణ/తూప్రాన్ రూరల్ (మనోహరాబాద్)
ప్రతి విద్యార్ధికి మంచి చదువుతో పాటు శాస్త్ర సాంకేతికత అవసరమని అందుకే పాఠశాలలో సైన్స్ ల్యాబ్‌ను ప్రారంభించడం జరుగుతుందని ఎంపీపీ పురంనవనీత రవిముదిరాజ్, రాష్ట్ర సర్పంచ్ల ఫోరం ఉపాద్యక్షులు నత్తి మల్లేష్ముదిరాజ్లు పేర్కొన్నారు. మండలంలోని కాళ్ళాకల్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో గ్లోస్టర్ కేబుల్ పరిశ్రమ ఆద్వర్యంలో సీఎస్ఆర్ నిధులు 63 వేలతో సైన్స్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా పరిశ్రమ ప్రతి నిధులతో కలిసి శుక్రవారం రోజు సైన్స్ ల్యాబ్‌ను ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలను తీర్చడానికి పరిశ్రమలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. విద్యార్థులు చదువుతో పాటు ల్యాబ్‌లో ప్రాక్టికల్ చేయడంతో మరింత విద్యను పొందుతారని అన్నారు. పరిశ్రమ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన ల్యాబ్‌తో విద్యార్థులు మంచిగా చదువుకుని మంచి ర్యాంకులను పొంది సద్వినియోగం చేసుకుని సార్దకతను పొందాలని మంచి పేరును తీసుకురావాలని సూచించారు. ఈ సందర్బంగా మండల పార్టీ అధ్యక్షులు పురం మహేశ్వర్ముదిరాజ్ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు కంప్యూటర్లు ఉన్నాయని కానీ ప్యాకల్టీలేక విద్యార్థులు కంప్యూటర్ విద్యకు దూరమవుతున్నారని పాఠశాలకు ఒక ప్యాకల్టీని ఏర్పాటు చేయాలని కోరారు. దాంతో పరిశ్రమ ప్రతి ఇనధులు అంగీకరించి తమకు వినతి ఇవ్వాలని వెంటనే ఏర్పాటు చేస్తామని పరిశ్రమ ప్రతినిధి కల్లీస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసి నత్తి లావణ్య మల్లేష్ముదిరాజ్, ఉపసర్పంచ్ తుమ్మల రాజుయాదవ్, గ్లోస్టర్ కేబుల్ ప్రతినిధులు మనోజ్గుప్త, డీఎన్ బోస్, 511 ప్రాజెక్టు ప్రతినిధి వీరేషలింగం, ఏఎస్ నాగేశ్వరరావ్, సురేష్, హరిగోపాల్, ఎస్ఎంసి చైర్మన్ కృష్ణ, వార్డు సభ్యులు, పాఠశాల ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.