Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నిజాంపేట
నిజాంపేట మండల కేంద్రానికి ప్రైమరీ హెల్త్ సెంటర్ను మంజూరు చేసినందుకుగాను సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డిల చిత్రపటాలకు టీఆర్ఎస్ నాయకులు కొత్త బస్టాప్ దగ్గర పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నిజాంపేట మండల ఎంపీపీ దేశెట్టి సిద్ధ రాములు మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంజూరు చేయడం పట్ల హర్షం ప్రకటించారు. మండల ప్రజల కళ నెరవేర్చినందుకు మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేశెట్టి సిద్ధ రాములు, సర్పంచ్ అనూష లక్ష్మీ నరసింహ్లు, ఎంపీటీసీ లహరి కృష్ణారెడ్డి, కల్వకుంట పీఏసీఎస్ చైర్మన్ అందే కొండల్ రెడ్డి, మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ బిజ్జా సంపత్, రామాయంపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎదుగని వెంకటేశం, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గరుగుల శ్రీనివాస్, జిల్లా నూర్ భాషా అధ్యక్షుడు అబ్దుల్ పాషా, ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల మహేష్, ఎంపీటీసీల పురం అధ్యక్షుడు బాల్రెడ్డి, గ్రామ రైతు సమన్వయ సమితి మెంబర్ కొమ్మట చంద్రయ్య , నియోజకవర్గ ఇన్చార్జి రంజిత్ గౌడ్, గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడు నాగరాజు, మండల టీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు మావురం రాజు, వార్డు మెంబర్ తిరుమల్ గౌడ్, ఎక్స్ కో ఆప్షన్ నెంబర్ అబ్దుల్, ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి నందు, టీఆర్ఎస్ నాయకులు లక్ష్మీనరసింలు ఎల్ రాములు, నాయిని లక్ష్మణ్, మహేష్ పాల్గొన్నారు.