Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్టేషన్లో రైల్వే రిజర్వేషన్ బుకింగ్ కౌంటర్ ఏర్పాటు చేయాలి
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యే రఘునందన్ రావు
నేవతెలంగాణ-చేగుంట
చేగుంట మండల కేంద్రంలోని వడియారం రైల్వే స్టేషన్లో దేవగిరి, రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపాలని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు కేంద్ర పర్యాటక సాంస్కతిక మంత్రి కిషన్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. చేగుంట మీదుగా మెదక్ వెళుతున్న క్రమంలో కిషన్ రెడ్డి మంత్రికి చేగుంట పట్టణ కేంద్రం ఐబి గెస్ట్ హౌస్ వద్ద స్వాగతం పలికారు. అనంతరం దేవగిరి రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైలు గురించి వివరించారు. దాదాపు 18 రాష్ట్రాల ప్రజలు ఆధారపడి చేగుంట, నార్సింగి, శంకరంపేట మండలాల్లోని వివిధ పరిశ్రమలలో చాలా రాష్ట్రాల కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. దాంతో పాటు మెదక్ జిల్లాలోని మండల కేంద్రంలో ఉన్న ఏకైక రైల్వే స్టేషన్ వడియారం (చేగుంట) మెదక్ జిల్లాలోని ఎక్కువ ఆదాయం కలిగిన రైల్వే స్టేషన్ కూడా వడియారం రైల్వే స్టేషన్ కావున ఇక్కడి ప్రజలకు ఈ మూడు మండలాల్లో పనిచేస్తున్న వివిధ పరిశ్రమల కార్మికులకు అనుకూలమైన ట్రైన్ దేవగిరి ఎక్స్‌ప్రెస్, రాయలసీమ ఎక్స్‌ప్రెస్, స్టాప్ చేయించి రైల్వే రిజర్వేషన్ కోసం ప్రైవేట్ సంస్థల మీద ఆధారపడి ఎక్కువ మొత్తంలో డబ్బు చెల్లించాల్సిన పరిస్థితి ఉన్నందున, ఇక్కడ దేవగిరి, రాయలసీమ రెండు ట్రైన్స్‌తో పాటు రైల్వే రిజర్వేషన్ బుకింగ్ కౌంటర్ ఏర్పాటు చేయించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వీలైనంత త్వరగా సంబంధిత కేంద్ర రైల్వే మంత్రితో చర్చించి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు భూపాల్, పట్టణ అధ్యక్షులు సాయి, దుబ్బాక కోకన్వీనర్ గోవింద్ కృష్ణ, సర్పంచులు ప్రవళిక బిక్షపతి, ఎల్లారెడ్డి, ఎంపీటీసీ బెదరమైన భాగ్యమ్మ, వైస్ ఎంపీపీ, మాజీ ఎంపీపీ పాండు, దౌల్తాబాద్ సీనియర్ బీజేపీ నాయకులు దొంతి రెడ్డి అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.