Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోహెడ
మండలంలోని కూరెళ్ళ గ్రామ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు శుక్రవారం గ్రామ సర్పంచ్ గాజుల రమేష్ చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఏకరూప దుస్తువులను విద్యార్థులకు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని వసతులను కల్పించడానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు కృషి చేస్తుందన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో మెదిలి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మార్గం తిరుపతి, సంపంగి రాంచంద్రం, ఈగ మల్లయ్య, కోణవేని మంజులరాజు, ఇట్టవేని రేణుకకొమురయ్య, చిట్యాల లక్ష్మిశంకరయ్య నాయకులు పొన్నాల రవీంధర్, చిట్యాల రాజమల్లు ఉపాద్యాయులు శ్రీనివాస్, సత్తయ్య, శ్రీలత, సుమలత, సంగీత, తదితరులు పాల్గొన్నారు.