Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే విజయ్ పాల్ రెడ్డి
నవతెలంగాణ-పెద్దశంకరంపేట్
బీజేపీ ప్రభుత్వం తోనే అభివృద్ధి సాధ్యమని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే విజయ్ పాల్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఓబీసీ అధ్యక్షులు ఆలే భాస్కర్ రాజ్లు అన్నారు. శుక్రవారం పెద్ద శంక రంపేట మండల పరిధిలోని బుజరాన్ పల్లి టెంక టి జీ వెంకటాపూర్. ఆరేపల్లి కోలపల్లి బూరుగు పల్లి లక్ష్మాపూర్ తదితర గ్రామాలలో ప్రజా గోస బీజేపీ భరోసా యాత్రలో పాల్గొని మాట్లాడారు. ఆయా గ్రామాలలో బీజేపీ జెండాలను ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవు తుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ను, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుందన్నా రు. కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వ పథకాలను గ్రామాలలో ఇంటింటికి ప్రచారం చేయాలన్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జన్వాడ సంగప్ప మాట్లాడుతూ సీఎం కేసీఆర్ విద్యుత్ మీటర్లు కేంద్ర ప్రభుత్వం పెడుతుందని బీజేపీని బద్నాం చేస్తున్నాడని విమర్శించారు. 18 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందని ఇక్కడ కూడా వ్యవసాయ మోటార్లకు మీటర్లు లేవని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప, మాజీ ఎమ్మెల్యే విజ యపాల్ రెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, రాజేశ్వర్ దేశ్పాండే, ఇన్చార్జిలు మహి పాల్ రెడ్డి రవికుమార్, మండల బీజేపీ అధ్యక్షులు కోణం విట్టల్, మండల బీజేపీ నాయకులు మంగలి కృష్ణ శ్రావణ్, దమ్ము సాయిలు కాశీరాం, బొగుడాల కృష్ణ, విశ్వనాథం, ఆర్ సాయిలు, ఆయా గ్రామాల నుంచి అధిక సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.